Share News

పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలకు ఫుల్ స్టాప్

ABN , Publish Date - Jun 29 , 2026 | 09:07 PM

రిటెయిల్ పెట్రోల్ బంకుల్లో కమర్షియల్ కొనుగోళ్లపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జులై 1 నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది.

పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలకు ఫుల్ స్టాప్
Restrictions on Commercial Fuel Purchases Lifted

ఇంటర్నెట్ డెస్క్: రిటెయిల్ పెట్రోల్ బంకుల్లో కమర్షియల్ కొనుగోళ్లపై గతంలో విధించిన ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జులై 1 నుంచి ఎలాంటి ఆంక్షలు ఉండవని పేర్కొంది. దేశంలో ఇంధన సరఫరా సాధారణ స్థితికి చేరుకున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

పశ్చిమాసియా ఉద్రిక్తతలతో ఇంధన సరఫరాకు అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్రం జూన్ 12న ఈ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇంధన కొరతకు తోడు కమర్షియల్ బయ్యర్లు కూడా రిటెయిల్ బంకుల్లో కొనుగోళ్లు చేయడంతో పలు చోట్ల సామాన్యులకు పెట్రోల్, డీజిల్ దొరక్క ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


దీంతో, రిటెయిల్ బంకుల్లో కమర్షియల్ కొనుగోళ్లు చేయకుండా తాత్కాలిక నిషేధం విధించింది. బల్క్ స్టేషన్స్ నుంచే పారిశ్రామిక అవసరాలకు ఇంధనం కొనుగోలు చేయాలని పేర్కొంది. ఇంధన కొనుగోలుపై రోజువారి పరిమితిని కూడా కేంద్రం అప్పట్లో విధించింది. ఒక వ్యక్తి రోజుకు 200 లీటర్లకు మించి డీజిల్ కొనుగోలు చేయకూడదని పేర్కొంది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో మునుపటి ఆంక్షలకు కేంద్రం ముగింపు పలికింది. ఈ చర్యతో ట్రాన్స్‌పోర్టు ఆపరేటర్లకు, ఇతర వ్యాపారులకు ఊరట లభించనుంది.


ఈ వార్తలనూ చదవండి:

ఈవీ పాలసీ 2026కు ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సర్కారు ఆమోదం

అయోధ్య విరాళాల కేసు.. నిందితులకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

Updated Date - Jun 29 , 2026 | 09:17 PM