Share News

గూగుల్‌ వాలెట్‌లో డిజిటల్‌ ఆధార్‌

ABN , Publish Date - Apr 29 , 2026 | 06:41 AM

టెక్‌ దిగ్గజం గూగుల్‌, ఆధార్‌ సంస్థ ఉడాయ్‌తో జట్టు కట్టింది. దీంతో ఆధార్‌ వివరాలను మీ ఫోన్‌లోని గూగుల్‌ వాలెట్‌లో భద్రపరుచుకోవచ్చు...

గూగుల్‌ వాలెట్‌లో డిజిటల్‌ ఆధార్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 28: టెక్‌ దిగ్గజం గూగుల్‌, ఆధార్‌ సంస్థ ఉడాయ్‌తో జట్టు కట్టింది. దీంతో ఆధార్‌ వివరాలను మీ ఫోన్‌లోని గూగుల్‌ వాలెట్‌లో భద్రపరుచుకోవచ్చు. అథెంటికేషన్‌ అవసరమైన చోట వాలెట్‌లోని కార్డు చూపిస్తే సరిపోతుంది. ఒక వేళ దానిని షేర్‌ చేయాల్సిన అవసరం వస్తే... అవసరమైన సమాచారాన్ని మాత్రమే పంచుకునే వెసులుబాటు కూడా గూగుల్‌ వాలెట్‌లో అందుబాటులో ఉంది. దీనికి ముందుగా మీ ఆధార్‌ను, గూగుల్‌ వాలెట్‌తో లింక్‌ చేసుకోవాలి. అయితే ఇది పాన్‌కార్డు, బ్యాంకు ఖాతాలను లింక్‌ చేయడం వంటిది కాదు. లింక్‌ చేయడం పూర్తి అయిన తరువాత మీ ఆధార్‌ వివరాలు డిజిటల్‌ ఐడీ రూపంలో వాలెట్‌లో సురక్షితంగా ఉంటాయి. ప్రస్తుతం దీనిని పీవీఆర్‌ ఐనాక్స్‌, భారత్‌ మ్యాట్రిమోనీల్లో వాడుకోవచ్చు. త్వరలో మైగేట్‌, స్నాబిట్‌ వంటి ఇతర వేదికలకూ ఈ ఆధార్‌ వెరిఫికేషన్‌ సౌకర్యాన్ని విస్తరిస్తామని గూగుల్‌ పేర్కొంది.

ఇవి కూడా చదవండి..

గుడ్ న్యూస్.. బంగారం ధరలు తగ్గాయి.. ప్రస్తుతం ఎలా ఉన్నాయంటే..

న్యూజిలాండ్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం.. ఈ రంగాలకు లాభమే..

Updated Date - Apr 29 , 2026 | 06:41 AM