రాముడు, కృష్ణుడు, సీతను అవమానించారు
ABN , Publish Date - Aug 12 , 2026 | 07:48 AM
యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను భారత్‌లో నిలిపివేసినట్లు గూగుల్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అతను యూట్యూబ్‌లో ఉంచిన వీడియో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, అందులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతమ్మ వారిని అవమానించేలా ప్రకటనలు ఉన్నాయని..దాన్ని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ వివాద పరిష్కార సంస్థ గూగుల్‌ను ఆదేశించింది.
ధ్రువ్ రాఠీ వీడియోను భారత్‌లో నిలిపివేశాం: గూగుల్
న్యూఢిల్లీ, ఆంధ్రజ్యోతి : యూట్యూబర్ ధ్రువ్ రాఠీ వీడియోను భారత్‌లో నిలిపివేసినట్లు గూగుల్ సంస్థ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అతను యూట్యూబ్‌లో ఉంచిన వీడియో మతపరమైన విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందని, అందులో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, సీతమ్మ వారిని అవమానించేలా ప్రకటనలు ఉన్నాయని..దాన్ని తొలగించాలంటూ కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్ వివాద పరిష్కార సంస్థ గూగుల్‌ను ఆదేశించింది. జీఏసీ జూలై 15న ధ్రువ్ రాఠీ వీడియోను తొలగించాలని ఆదేశించడంతో దాన్ని భారతదేశంలో నిలిపివేశామని న్యాయవాది అమితా సచ్‌దేవా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా హైకోర్టుకు తెలియజేసింది.
ఇవి కూడా చదవండి
అరుదైన కోతి పెంపకం..వివాదంలో విక్రమ్!