ప్రపంచానికి ఆహార సంక్షోభం ముప్పు!
ABN , Publish Date - Mar 15 , 2026 | 06:47 AM
పశ్చిమాసియా యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత వల్ల ఆహార పంటలకు ముప్పు ఏర్పడనుంది. ఆసియా, యూరప్, పలు ఇతర దేశాల రైతులు వ్యవసాయానికి అవసరమైన...
న్యూఢిల్లీ, మార్చి 14: పశ్చిమాసియా యుద్ధం, ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత వల్ల ఆహార పంటలకు ముప్పు ఏర్పడనుంది. ఆసియా, యూరప్, పలు ఇతర దేశాల రైతులు వ్యవసాయానికి అవసరమైన యంత్రాల నిర్వహణకు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నారు. ఫిలిప్పైన్స్‌లోని మత్స్యకారులు తమ బోట్లకు ఇంధన లేక కార్యకలాపాలు నిలిపివేసి ఒడ్డునే ఉంచాల్సిన స్థితి నెలకొంది. ఈ దీర్ఘకాల ఇంధర సరఫరా కొరత వల్ల ఆహారానికి కొరత ఏర్పడటంతో పాటు ధరలు పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో రైతులు గోధుమ, బార్లీ సాగుకు సన్నద్ధమవుతుండగా, యూర్‌పలోని చాలా ప్రాంతాల రైతులు బార్లీ, మొక్కజొన్న సాగుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఇప్పటికే చేతికొచ్చే దశకు చేరిన పంటలు ఇంధన కొరత వల్ల పొలాల్లోనే దెబ్బతినే ముప్పు ఉంది. అదే సమయంలో పంట కోత తర్వాత ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేయడానికి, రవాణా చేయడానికయ్యే ఖర్చులు కూడా పెరగనున్నాయి. దీర్ఘకాల ద్రవ్యోల్బణ సమస్యలు తలెత్తుతాయని, దాని భారం అంతిమంగా వినియోగదారుడిపై పడుతుందని ఆస్ట్రేలియాకు చెందిన వ్యవసాయ నిపుణుడు పాల్ జౌల్స్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు ఫోకస్.. మంత్రులతో చర్చ
కేంద్రమంత్రి అన్నపూర్ణా దేవితో మంత్రి సీతక్క భేటీ.. చర్చించిన అంశాలివే