Share News

డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న సైకియాట్రిస్ట్..

ABN , Publish Date - Aug 03 , 2026 | 12:23 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ సైకియాట్రిస్ట్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్‌పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్న సైకియాట్రిస్ట్..
A 40 year old psychiatrist

ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌లో విషాదకరమైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఓ సైకియాట్రిస్ట్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకుంది. బిల్డింగ్‌పైనుంచి దూకి ప్రాణాలు తీసుకుంది. ఆదివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల మేరకు.. ఘజియాబాద్‌కు చెందిన 40 ఏళ్ల మెహికా అగర్వాల్ సైకియాట్రిస్ట్‌గా సేవలందిస్తోంది. ఏడాదిన్నర క్రితం ఆమె భర్తతో విడాకులు తీసుకుని విడిపోయింది. విడాకుల కారణంగా మెహికా మానసిక ఆరోగ్యం బాగా దెబ్బతింది. 18 నెలల నుంచి మెంటల్ స్ట్రెస్, డిప్రెషన్‌తో బాధపడుతోంది.


ఈ నేపథ్యంలోనే ఆదివారం రాజ్ నగర్ ఎక్స్‌టెన్షన్ ఏరియా, ఆఫీసర్స్ సిటీ 2 సొసైటీలో ఉన్న అపార్ట్‌మెంట్ బిల్డింగ్ ఐదో అంతస్తునుంచి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడ్డ ఆమెను స్థానికులు హుటాహుటిన దగ్గరిలోని ఆస్పత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే చనిపోయినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల నుంచి స్టేట్‌మెంట్స్ రికార్డు చేశారు. పోస్టుమార్టం రిపోర్టు, దర్యాప్తులో బయటపడ్డ విషయాల ఆధారంగా తదుపురి చర్యలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి

కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్ హతం.. తుపాకీ లాక్కుని పారిపోతుండగా

కామన్వెల్త్ గేమ్స్ అద్భుతంగా ముగిశాయి: పవన్ కల్యాణ్

Updated Date - Aug 03 , 2026 | 12:32 PM