Share News

'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో జనరల్ ఉపేంద్ర ద్వివేదికి చోటు

ABN , Publish Date - Apr 24 , 2026 | 04:24 PM

భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీకి చెందిన 'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయనకు చోటు దక్కింది.

'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో జనరల్ ఉపేంద్ర ద్వివేదికి చోటు
General Upendra Dwivedi

న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: భారత సైన్యాధ్యక్షుడు జనరల్ ఉపేంద్ర ద్వివేది అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. పెన్సిల్వేనియాలోని యుఎస్ ఆర్మీ వార్ కాలేజీకి చెందిన 'ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్'లో ఆయనకు చోటు దక్కింది. ఈ గౌరవాన్ని అందుకున్న మూడవ భారతీయ సైన్యాధ్యక్షుడిగా జనరల్ ఉపేంద్ర ద్వివేది నిలిచారు. గతంలో జనరల్ వీకే సింగ్, జనరల్ విక్రమ్ సింగ్‌లకు ఇంటర్‌నేషనల్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటుదక్కింది. ఈ విషయాన్ని ఇండియన్ ఆర్మీ ఎక్స్ వేదికగా తెలియజేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ పోస్టు పెట్టింది.


ఆ పోస్టులో.. ‘జనరల్ ఉపేంద్ర ద్వివేది స్వయంగా ఆ ప్రతిష్టాత్మక కళాశాల పూర్వ విద్యార్థి. పర్యటనలో భాగంగా ఆయన కీలక విభాగాలను సందర్శించారు. ప్యానెల్ చర్చల్లో పాల్గొన్నారు. స్కాలర్స్ ప్రోగ్రామ్‌లోని అధునాతన స్టడీ ప్రాజెక్టులను సమీక్షించారు. సంస్థలోని ప్రముఖ సభ్యులతో సంభాషించటంతో పాటు పలు విద్యాపరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు’ అని రాసుకొచ్చింది.


ఇవి కూడా చదవండి

హెల్తీ పీనట్ బటర్ రెసిపీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండిలా

సీఎం ఆకస్మిక తనిఖీ ఎఫెక్ట్.. 162 మంది అధికారులు బదిలీ

Updated Date - Apr 24 , 2026 | 05:02 PM