Share News

జనరల్‌ నరవణె పుస్తకాన్ని.. కావాలనే లీక్‌ చేశారు!

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:23 AM

లద్దాఖ్‌ సంక్షోభంపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె స్వీయచరిత్ర ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకంపై రేగిన రాజకీయ వివాదం ముదురుతోంది. కేంద్ర ప్రభుత్వం (రక్షణ శాఖ) ఈ పుస్తకం...

జనరల్‌ నరవణె పుస్తకాన్ని.. కావాలనే లీక్‌ చేశారు!

  • ప్రభుత్వ అనుమతి లేకుండానే గ్లోబల్‌ మార్కెట్లోకి ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’!!

  • ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేసిన ఢిల్లీ పోలీసులు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: లద్దాఖ్‌ సంక్షోభంపై ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ ఎంఎం నరవణె స్వీయచరిత్ర ‘ఫోర్‌ స్టార్స్‌ ఆఫ్‌ డెస్టినీ’ పుస్తకంపై రేగిన రాజకీయ వివాదం ముదురుతోంది. కేంద్ర ప్రభుత్వం (రక్షణ శాఖ) ఈ పుస్తకం ప్రచురణ అనుమతివ్వలేదు. అయినా గ్లోబల్‌ మార్కెట్లోకి అది రావడం.. దాని ప్రతి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీకి చేరడం.. లద్దాఖ్‌లో భారత్‌-చైనా సైన్యాల ఘర్షణకు సంబంధించి జనరల్‌ నరవణె సదరు పుస్తకంలో పేర్కొన్న అంశాలను సభలో ప్రస్తావించడానికి ఆయన ఈ నెల 4న ప్రయత్నించడం.. తదితర పరిణామాల నేపథ్యంలో పుస్తకం లీకేజీపై ఢిల్లీ పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేశారు. దేశీయంగా, అమెరికా, కెనడా, జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల్లోనూ దర్యాప్తునకు శ్రీకారం చుట్టారు. ఈ వ్యవహారంలో నేరపూరిత కుట్ర ఉందని ఢిల్లీ స్పెషల్‌ పోలీసు సెల్‌ అభియోగం మోపింది. ఈ పుస్తకాన్ని తామింకా ప్రచురించలేదని.. అధికారిక ప్రతులేవీలేవని ప్రచురణ సంస్థ ‘పెంగ్విన్‌ ఇండియా’ వివరణ ఇచ్చింది. అప్పటికే పోలీసులు ఆ సంస్థకు నోటీసులు ఇచ్చారు.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:23 AM