Share News

ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు.. ‘100 శాతం’ లేబుల్‌ తొలగింపు

ABN , Publish Date - Aug 25 , 2026 | 04:58 PM

భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసుల నేపథ్యంలో పలు ఫుడ్ బిజెనెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల లేబుల్స్‌కు సంబంధించి దిద్దుబాటు చర్యలకు దిగారు.

ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసులు.. ‘100 శాతం’ లేబుల్‌ తొలగింపు
Companies Remove Misleading Labels

ఇంటర్నెట్ డెస్క్: భారత ఆహార నియంత్రణ సంస్థ ఎఫ్ఎస్ఎస్ఏఐ నోటీసుల నేపథ్యంలో పలు ఫుడ్ బిజెనెస్ ఆపరేటర్లు తమ ఉత్పత్తుల లేబుల్స్‌కు సంబంధించి దిద్దుబాటు చర్యలకు దిగారు. కస్టమర్స్‌ను తప్పుదారి పట్టించే లేబుల్స్, ప్యాకేజింగ్‌‌ను పలు కంపెనీలు సవరించుకున్నాయని ఆహార నియంత్రణ సంస్థ మంగళవారం ఎక్స్ వేదికగా పేర్కొంది. ఆమ్వే ఇండియా, జుజా ఫుడ్స్, మోండెలెజ్ ఇండియా ఫుడ్స్, సేపియన్స్ ల్యాబ్స్ వంటి సంస్థలు దిద్దుబాటు చర్యలు తీసుకున్నాయని ఆహార నియంత్రణ సంస్థ తెలిపింది.


ఓ ప్రాడక్ట్‌పై ఎనర్జీ డ్రింక్ అన్న పదాన్ని ఆమ్వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్ తొలగించిందని ఎఫ్ఎస్ఎస్ఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ప్రాడక్ట్ కెఫీనేటెడ్ ఉత్పత్తి అయినప్పటికీ గతంలో ఎనర్జీ డ్రింగ్ అన్న లేబుల్ ఉందని పేర్కొంది. ఎనర్జీ పదాన్ని తొలగించినట్టు ఆమ్వే కూడా ధ్రువీకరించింది. తదుపరి ప్రొడక్షన్ సైకిల్ నుంచి ఈ మార్పులు అమల్లోకి వస్తాయని తెలిపింది. అంతేకాకుండా తమ కొబ్బరి నూనె ప్రాడక్ట్‌పై నుంచి ‘100 శాతం’ అని రాసున్న లేబుల్‌ను కూడా ఆమ్వే తొలగించింది. మరో ఆహార సంస్థ జుజా ఫుడ్స్ కూడా తమ ఉత్పత్తులకు సంబంధించి ప్యూర్, నేచురల్, ట్రెడిషనల్, 100 శాతం రాగి, సులువుగా జీర్ణమయ్యే ఉత్పత్తి వంటి పదాలను లేబుల్స్‌ నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొంది.


తప్పుదోవ పట్టించే యాడ్స్, లేబుల్స్, ప్యాకేజింగ్‌పై అభ్యంతరాలు వ్యక్తం ఎఫ్ఎస్ఎస్ఏఐ శనివారం దాదాపు 150 సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పలు సంస్థలు స్పందించి లేబుల్స్‌లో మార్పులు చేసేందుకు సిద్ధమయ్యాయి.

ఈ వార్తలనూ చదవండి:

రాహుల్ గాంధీ ఒక చైనా రోబో: బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర

కృతి సనన్‌ రాఖీ యాడ్‌పై దుమారం.. స్పందించిన కంగనా రనౌత్‌

Updated Date - Aug 25 , 2026 | 05:05 PM