FSSAI కొత్త రూల్స్.. తుప్పు పట్టిన కత్తులు వాడితే చర్యలు
ABN , Publish Date - Jun 17 , 2026 | 01:15 PM
హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ కంపెనీలకు ‘ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వంట తయారు చేయటం కోసం తుప్పుపట్టిన, విరిగిన, రంగు వేసిన, పాడైన కత్తులను వాడకూడదని తేల్చి చెప్పింది.
ఇంటర్‌నెట్ డెస్క్: హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ బిజినెస్ కంపెనీలకు ‘ది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా’ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. వంట తయారు చేయటం కోసం తుప్పుపట్టిన, విరిగిన, రంగు వేసిన, పాడైన కత్తులను వాడకూడదని తేల్చి చెప్పింది. ఆహార పదార్థాలు కలుషితం కాకుండా ఉండేందుకు ఎఫ్ఎస్ఎస్ఏఐ పరిశుభ్రత ప్రమాణాలను కఠినతరం చేసింది. వంటగదుల్లో ఉపయోగించే కత్తులు, కటింగ్ బోర్డులు, ఇతర పరికరాలు శుభ్రంగా.. మంచి స్థితిలో ఉండాలని సూచించింది.
తుప్పు పట్టిన లేదా దెబ్బతిన్న పరికరాలను వంట చేయటం కోసం ఉపయోగించటం వల్ల ఆహారంలో హానికరమైన కణాలు కలిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. రెస్టారెంట్లు, హోటళ్లు, క్యాటరింగ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ కేంద్రాలు ఈ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వంటగది నిర్వహణపై సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ సూచించింది. ఫుడ్ బిజినెస్‌లో నాణ్యత, భద్రతా ప్రమాణాలను పెంచడమే ఈ కొత్త ఆదేశాల ప్రధాన ఉద్దేశమని పేర్కొంది.
కాగా, హోటళ్లు, రెస్టారెంట్‌లలో తనిఖీలు చేసిన ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారులు అక్కడ ఓ విషయాన్ని గమనించారు. వంట వాళ్లు వంట చేయటం కోసం తుప్పుపట్టిన, విరిగిన, రంగు వేసిన, పాడైన కత్తులను వాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎఫ్ఎస్ఎస్ఏఐ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ పాఠశాలల్లో చదవటం నామోషీ అనే ఆలోచన పోవాలి: సీఎం రేవంత్
హోంమంత్రి అనితపై వ్యాఖ్యలు.. అమర్నాథ్ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్లు