దావోస్‌లో ట్రంప్ విందు.. హాజరు కాబోతున్న భారతీయ సీఈవోలు వీరే..
ABN , Publish Date - Jan 20 , 2026 | 09:25 PM
స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో పలు దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇప్పటికే చాలా మంది దావోస్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరేళ్ల తర్వాత ఈ సదస్సుకు హాజరుకాబోతున్నారు.
స్విట్జర్లాండ్‌లోని దావోస్ నగరంలో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (WEF)లో పలు దేశాల అధినేతలు, వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఇప్పటికే చాలా మంది దావోస్ చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరేళ్ల తర్వాత ఈ సదస్సుకు హాజరు కాబోతున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సు కోసం ట్రంప్ రావడం ఇది మూడోసారి (Indian CEOs Davos).
ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్ దావోస్‌లో భారీ విందు కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ విందులో పాల్గొనాల్సిందిగా ఏడుగురు భారతీయ సీఈవోలకు ఆహ్వానాలు అందినట్టు సమాచారం. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్, భారతీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్, విప్రో సీఈవో శ్రీని పల్లియా, ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ ఎస్ పరేఖ్, బజాజ్ ఫిన్‌సెర్వ్ సీఎండీ సంజీవ్ బజాజ్, మహీంద్ర గ్రూపు సీఈవో అనీశ్ షా, జుబిలెంట్ భర్తియా గ్రూపు వ్యవస్థాపకుడు హరి భర్తియాలు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం (Donald Trump Davos meeting).
ఈ సదస్సులో ట్రంప్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది (Indian business leaders). ట్రంప్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలపై సుంకాలు విధించడం, గ్రీన్‌ల్యాండ్‌ను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుండడంతో దావోస్‌లో ఆయన ఏం మాట్లాడతారోనని చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా 130 దేశాల నుంచి 3 వేల మందికి పైగా ప్రతినిథులు హాజరుకాబోతున్నారు.
ఇవి కూడా చదవండి..
రీల్స్ కోసం ప్రాణాలనైనా లెక్క చేయం.. ఈ యువకుడి బైక్ స్టంట్ చూస్తే..
మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ ఫొటోలో ఉన్న పావురాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..