విజయ్ ప్రభుత్వం కూల్చివేత కుట్ర కేసులో మరో నలుగురి అరెస్టు
ABN , Publish Date - Jul 03 , 2026 | 06:48 AM
తమిళనాట టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీగా బేరసారాలు జరిపారనే ఆరోపణలపై నమోదైన కేసులో గురువారం మరో నలుగురు...
చెన్నై, జూలై 2 (ఆంధ్రజ్యోతి): తమిళనాట టీవీకే ప్రభుత్వాన్ని కూల్చేందుకు భారీగా బేరసారాలు జరిపారనే ఆరోపణలపై నమోదైన కేసులో గురువారం మరో నలుగురు అరెస్టయ్యారు. దీంతో ఈ కేసులో అరెస్టయినవారి సంఖ్య 9కి పెరిగింది. ఈ కేసులో డీఎంకే మాజీ మంత్రి సెంథిల్‌బాలాజీ, ఆయన సోదరుడు అశోక్‌కుమార్ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఇటీవల శాసనసభలో స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని డీఎంకే ప్రయత్నిస్తున్న సమయంలో తనకు తిరునావుక్కరసు అనే వ్యక్తి ఫోన్ చేసి భారీగా ముడుపులు ఇస్తామని బేరసారాలు నడిపినట్లు కృష్ణగిరి జిల్లా ఊత్తాంగరై టీవీకే ఎమ్మెల్యే ఇళయరాజా పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురు అరెస్టు కాగా, మరో నలుగురిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఇవి కూడా చదవండి
టీ తాగడం మంచిదే.. కానీ ఈ 6 పొరపాట్లు చేస్తే సమస్యలు తప్పవు
కోళ్లు అరుస్తున్నాయని వెళ్లి చూస్తే.. మృత్యువు వెంటాడింది