Share News

హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌కు గ్యాస్‌ ఏజెన్సీ!

ABN , Publish Date - Jul 17 , 2026 | 05:46 AM

మణిపూర్‌ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి.. రిటైర్డు జస్టిస్‌ సిద్దార్థ్‌ మృదుల్‌ జడ్జిగా ఉన్న సమయంలో ఆయన పేరిట ఓ గ్యాస్‌ ఏజెన్సీ ఉండడం తీవ్ర..

హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌కు గ్యాస్‌ ఏజెన్సీ!

న్యూఢిల్లీ, జూలై 16: మణిపూర్‌ హైకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి.. రిటైర్డు జస్టిస్‌ సిద్దార్థ్‌ మృదుల్‌ జడ్జిగా ఉన్న సమయంలో ఆయన పేరిట ఓ గ్యాస్‌ ఏజెన్సీ ఉండడం తీవ్ర వివాదాస్పదమైంది. సుప్రీం కోర్టు బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి ఆయన అభ్యర్ధిత్వానికి కూడా ఈ వివాదం ఆటంకంగా మారింది. నిబంధనల ప్రకారం న్యాయమూర్తి వంటి రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారు ఇతర వ్యాపారాల్లో కొనసాగడం పరస్పర విరుద్ధ ప్రయోజనాల(కాన్‌ఫ్లిక్ట్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌) కిందకు వస్తుంది. అయితే, సదరు గ్యాస్‌ ఏజెన్సీ మాజీ మేనేజర్‌ సతీమణి యాజమాన్య హక్కుల బదిలీ కోసం రెండు నెలల క్రితం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో జడ్జికి గ్యాస్‌ ఏజెన్సీ ఉందనే విషయం బయటకు వచ్చింది. దీంతో స్పందించిన బీపీసీఎల్‌.. వివాదంపై వివరణ కోరుతూ రిటైర్డు జస్టిస్‌ మృదుల్‌కు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు స్పందన లేకపోవడంతో జూలై 6న సదరు ఏజెన్సీ లైసెన్స్‌ను రద్దు చేసింది.

ఈ వార్తలనూ చదవండి:

న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..

ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌‌పై హెచ్చరిక

Updated Date - Jul 17 , 2026 | 05:46 AM