Share News

ఎరువులపై సబ్సిడీ రూ.41,534 కోట్లకు పెంపు

ABN , Publish Date - Apr 09 , 2026 | 06:33 AM

రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరుగుతోన్న వేళ..

ఎరువులపై సబ్సిడీ రూ.41,534 కోట్లకు పెంపు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8: రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో అంతర్జాతీయంగా ఎరువుల ధరలు పెరుగుతోన్న వేళ.. 2026 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ఎరువులపై సబ్సిడీని భారీగా పెంచింది. పాస్పిటిక్‌, పొటాసిక్‌(పీ,కే) ఎరువులపై సబ్సిడీ మొత్తాన్ని రూ.41,534 కోట్లకు పెంచింది. 2025 ఖరీఫ్‌ సీజన్‌లో ఈ సబ్సిడీ రూ.37,216 కోట్లుగా ఉంది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఈ సబ్సిడీ పెంపునకు ఆమోదం తెలిపింది. 2026 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు పెరిగిన సబ్సిడీ అమలులో ఉంటుంది. 2025-26 రబీ సీజన్‌లో నత్రజని(నైట్రోజన్‌)పై కిలోకు రూ.43.02 చొప్పున సబ్సిడీ ఇచ్చిన కేంద్రం 2026 ఖరీఫ్‌ సీజన్‌లో దానిని రూ.47.32కు పెంచింది. ఫాస్పేట్‌ సబ్సిడీని కిలోకు రూ.47.96 నుంచి రూ.52.76కు, సల్ఫర్‌పై సబ్సిడీని కిలోకు రూ.2.87 నుంచి రూ.3.16కు పెంచింది. పొటా్‌షపై కిలోకు రూ.2.38 చొప్పున ఇస్తోన్న రాయితీలో మాత్రం మార్పు చేయలేదు.

ఇవి కూడా చదవండి..

ట్రంప్ గుడ్ న్యూస్.. దేశీయ సూచీలకు ఫుల్ జోష్..

ఇరాన్‌కు మరో రెండు వారాల గడువు.. డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం..

Updated Date - Apr 09 , 2026 | 06:33 AM