ఎఫ్‌సీఐ బియ్యం బస్తాలకు క్యూఆర్ ట్యాగ్‌లు
ABN , Publish Date - Jun 04 , 2026 | 05:45 AM
బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎ్‌ఫసీఐ)కి చెందిన బియ్యం బస్తాలకు క్యూఆర్ ట్యాగింగ్ విధానాన్ని విస్తరించాలని...
ఏపీ, తెలంగాణ, ఒడిశాల్లో పైలట్ ప్రాజెక్టు అమలు
అక్రమ రవాణా, రీసైక్లింగ్ కుంభకోణాలకు అడ్డుకట్ట
న్యూఢిల్లీ, జూన్ 3: బియ్యం అక్రమ రవాణాను అరికట్టడంలో భాగంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎ్‌ఫసీఐ)కి చెందిన బియ్యం బస్తాలకు క్యూఆర్ ట్యాగింగ్ విధానాన్ని విస్తరించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత మార్కెటింగ్ సీజన్‌లో ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయనుంది. సేకరణ రాష్ట్రాల నుంచి పంపిణీ రాష్ట్రాలకు రవాణా చేసే బియ్యం బస్తాలకు క్యూఆర్ ట్యాగ్‌లు అమర్చాలని యోచిస్తున్నట్లు ఆహార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ప్రతి బస్తా ప్రయాణాన్ని డిజిటల్‌గా ట్రాక్ చేయడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థకు మరింత జవాబుదారీతనం తీసుకురావడమే లక్ష్యమని వివరించారు. దీనిలో భాగంగా 20లక్షల టన్నులకు పైగా బియ్యం రవాణాను పర్యవేక్షించనున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు కింద ఏపీలోని మిల్లింగ్ పాయింట్ల నుంచి పంపిణీ రాష్ట్రాలకు 10 లక్షల టన్నులు, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలనుంచి 5లక్షల టన్నుల చొప్పున బియ్యాన్ని క్యూఆర్ ట్యాగ్‌లతో తరలిస్తారు.ఈ విధానంలో లబ్ధిదారులకు పారదర్శకంగా సరుకులు అందడంతో పాటు బిల్లులు ఆటోమేటిక్‌గా జనరేట్ అవుతాయి. మరోవైపు పీడీఎస్ (రేషన్) బియ్యాన్ని నల్లబజారుకు తరలించి, మళ్లీ అధిక ధరలకు ప్రభుత్వానికి విక్రయించే రీసైక్లింగ్ కుంభకోణాలకు క్యూఆర్ ట్యాగ్ విధానంతో అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
బోర్లా పడ్డ రోహిత్ శర్మ.. అభిమానుల్లో ఆందోళన
గంగూలీ భద్రతను తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం.. ఎందుకంటే..