ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం.. వెలుగులోకి సంచలన విషయాలు..
ABN , Publish Date - Feb 25 , 2026 | 05:03 PM
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో రూ. 590 కోట్ల మోసం కేసులో నలుగురు అరెస్ట్ అయ్యారు. మాజీ ఉద్యోగులు పక్కా ప్లాన్‌తో రూ.590 కోట్లు దోచేసినట్లు అధికారులు గుర్తించారు. నిందితులు ఆ డబ్బును షెల్ కంపెనీకి మళ్లించినట్లు తెలిపారు.
చండీగఢ్, ఫిబ్రవరి 25: ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో 590 కోట్ల రూపాయలు మోసానికి గురైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కేసుతో సంబంధం ఉన్న నలుగురు వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. మాజీ బ్రాంచ్ మేనేజర్ రిభవ్ రిషి, మాజీ రిలేషన్‌షిప్ మేనేజర్ అభయ్, రిభవ్ భార్య స్వాతీ సింగ్లా, ఆమె సోదరుడు అభిషేక్ సింగ్లాలను పోలీసులు అరెస్ట్ చేశారు.
రిభవ్, అభయ్‌లు ప్రధాన నిందితులని అధికారులు తెలిపారు. యాంటీ కరప్షన్ బ్యూరో అధికారులు చెబుతున్న దాని ప్రకారం.. రిభవ్, అభయ్‌లు హర్యానా గవర్నమెంట్ డిపార్ట్‌మెంట్స్‌కు సంబంధించిన ఖాతాల్లోని డబ్బులను టార్గెట్ చేశారు. ఆ డబ్బులను స్వాతీ సింగ్లాకు చెందిన కంపెనీ ‘స్వస్తిక్ దేశ్ ప్రాజెక్ట్’కు బదిలీ చేశారు. ఈ కంపెనీ షేర్స్‌లో స్వాతి 75 శాతం వాటా కలిగి ఉంది. మిగిలిన 25 శాతం షేర్స్ అభిషేక్ పేరు మీద ఉన్నాయి.
నిందితులిద్దరూ దాదాపు 300 కోట్ల రూపాయలు కంపెనీకి మళ్లించారు. ఆరు నెలల క్రితం బ్యాంక్‌లో ఉద్యోగాలు మానేశారు. హార్యానా ప్రభుత్వానికి చెందిన ఓ డిపార్ట్‌మెంట్ ఆ బ్యాంక్‌లోని తమ ఖాతాను క్లోజ్ చేసి, డబ్బును వేరే బ్యాంక్ ఖాతాలోకి పంపాలని కోరింది. ప్రాసెస్ చేస్తున్న సమయంలో బ్యాంక్ అధికారులు మోసాన్ని గుర్తించారు. రికార్డ్స్‌లో ఉన్న డబ్బు మొత్తానికి.. బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తానికి తేడా కనుగొన్నారు.
ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ చండీగఢ్ బ్రాంచ్‌లో 590 కోట్ల రూపాయల మోసం జరిగినట్లు ఆదివారం బ్యాంక్ అధికారులు మీడియాకు వెల్లడించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు మాజీ బ్రాంచ్ మేనేజర్, మాజీ రిలేషన్‌షిప్ మేనేజర్‌లు ఈ మోసానికి పాల్పడినట్లు గుర్తించారు. వారితో పాటు మరో ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్టుని నిర్లక్ష్యంగా వదిలేశారు: సీఎం చంద్రబాబు
ఎప్‌స్టీన్ సంబంధాలపై ఫౌండేషన్ సిబ్బందికి బిల్ గేట్స్ క్షమాపణలు