గుడ్ న్యూస్.. ఈపీఎఫ్ కనీస వేతనం పెంపు
ABN , Publish Date - Sep 16 , 2026 | 03:45 PM
ఈపీఎఫ్ వేతనదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ కనీస వేతన పరిమితి పెంచే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఈపీఎఫ్ వేతనదారులకు గుడ్ న్యూస్. పీఎఫ్ కనీస వేతన పరిమితి పెంపునకు కేంద్ర కేబినెట్ తాజాగా ఆమోదం తెలిపింది. రూ.15 వేల పరిమితిని రూ.25 వేలకు పెంచేందుకు నిర్ణయించింది. దీంతో, కొత్తగా 51 లక్షల మంది ఈపీఎఫ్ఓ కవరేజీ పరిధిలోకి రానున్నారు. పీఎఫ్ కనీస వేతన పెంపుతో మరింత మంది వర్కర్లకు సామాజిక భద్రత లభిస్తుందని కార్మిక శాఖ పేర్కొంది. 2014లో చివరిసారిగా ప్రభుత్వం కనీస వేతనాన్ని రూ.15 వేలకు పెంచింది. వేతనాల వృద్ధి, ఆదాయాల వృద్ధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం పీఎఫ్ కనీస వేతనాన్ని పెంచేందుకు నిర్ణయించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం, రూ.15 వేలు, అంతకుమించి నెలవారీ వేతనంతో ఉద్యోగంలో చేరే వారు ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్ పరిధిలోకి రారు. ఈ పరిమితి పెంపుతో రూ.25 వేల వరకూ వార్షిక వేతనం ఉన్న వారు ఆటోమేటిక్‌గా పీఎఫ్ పరిధిలోకి వస్తారు. పీఎఫ్ సేవింగ్స్, పెన్షన్, ఇన్సూరెన్స్ సదుపాయం వంటివి వారికి అందుబాటులోకి వస్తాయి. వేతన పెంపుపై వివిధ మంత్రిత్వ శాఖలతో సంప్రదింపుల అనంతరం కేంద్రం తుది నిర్ణయం తీసుకుంది. ఈపీఎఫ్ఓ డేటా ప్రకారం, ప్రస్తుతం 7.98 కోట్ల మంది పీఎఫ్ సభ్యులు ఉన్నారు. 82 లక్షల మందికి పీఎఫ్ పెన్షన్ సదుపాయం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్ ఆరోపణలు.. తోసిపుచ్చిన కేంద్రం
విధులకు హాజరుకాకుండానే నెలకు రూ.70 వేల జీతం.. కర్ణాటక ఎమ్మెల్యే మేనకోడలికి నోటీసు