జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్!
ABN , Publish Date - Jul 04 , 2026 | 09:42 PM
జమ్మూకశ్మీర్‌లో తాజాగా మరోసారి భద్రతాదళాలకు ఉగ్రవాదులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూకశ్మీర్‌లో తాజాగా ఎన్‌కౌంటర్ మొదలైైంది . శనివారం షోపియన్ జిల్లాలో ఉగ్రవాద ఏరివేత చర్యలు చేపడుతున్న భద్రతా దళాలపై టెర్రరిస్టులు కాల్పులకు దిగారు.
తొలుత పోలీసులు ఛానాపోరా, సైద్‌పోరా, అమ్షీపోరా, పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాదులు దాగున్నారన్న సమాచారం అందడంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో పోలీసులు కూడా ప్రతిదాడికి దిగారు. ప్రస్తుతం అదనపు భద్రతాదళాలు కూడా ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. అయితే, మొత్తం ఎంత మంది ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో దాగున్నారో ఇంకా తెలియరాలేదు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం.. ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు..
మీరు నన్ను ఆపాలనుకుంటే.. చంపాల్సిందే.. తిరుగుబాటుదారులకు మమత సవాల్..