ఫోన్లలో హెచ్చరిక సందేశాలు.. కంగారొద్దు
ABN , Publish Date - May 02 , 2026 | 05:52 AM
ఈ వారంలో ఎప్పుడైనా మీ ఫోన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేసినా, తెర అంతా కనిపించేలా ఏదైనా సందేశం వచ్చినా..
సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్‌ను పరీక్షిస్తున్న ఎన్‌డీఎంఏ
న్యూఢిల్లీ, మే 1: ఈ వారంలో ఎప్పుడైనా మీ ఫోన్ ఉన్నట్టుండి పెద్దగా శబ్దం చేసినా, తెర అంతా కనిపించేలా ఏదైనా సందేశం వచ్చినా.. కంగారు పడకండి. అది.. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్‌డీఎంఏ), టెలీకమ్యూనికేషన్స్ విభాగంతో కలిసి చేస్తున్న ‘సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ సిస్టమ్’కు సంబంధించిన ట్రయల్‌లో భాగంగా వచ్చిన సందేశం అయి ఉంటుంది. భూకంపాలు, పిడుగులు, సునామీలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తులు సంభవించినప్పుడు ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఒకేసారి సందేశం అందజేయడానికి ఈ అత్యవసర హెచ్చరికల వ్యవస్థను వినియోగిస్తారు. దీనివల్ల నెట్‌వర్క్ ఎంత రద్దీగా ఉన్నా ప్రజలకు సమాచారం వేగంగా అందుతుంది. పూర్తిగా దేశీయ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థను దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురానున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నేను సీఎం కావాలన్నా.. కుర్చీ ఖాళీగా లేదు
జీవితంలో ఓడి... పదిలో గెలిచిన వర్షిత..
Read Latest Telangana News and National News