రాష్ట్రపతి, ప్రధానిలతో గవర్నర్ భేటీ
ABN , Publish Date - Oct 27 , 2026 | 05:10 AM
తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం తన సతీమణి జానకి శుక్లాతోపాటు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.
న్యూఢిల్లీ, హైదరాబాద్, అక్టోబర్ 26 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సోమవారం తన సతీమణి జానకి శుక్లాతోపాటు న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం ప్రధాని నరేద్రమోదీతో గవర్నర్ సమావేశమయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వీరిద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, పాలనాపరమైన అంశాలను ప్రధానికి వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీ తప్పుకునేదే లేదు.. ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ కౌంటర్
SIR సహా అన్ని నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నాము.. ఈసీ అఫిడవిట్