మనీ లాండరింగ్ జరిగినట్లు ఆధారాలున్నాయి
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:38 AM
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని, అందువల్లే...
ట్రయల్ కోర్టు కోరితే వాదనలు వినిపిస్తాం
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు తీర్పుపై ఈడీ
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) స్పందించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ జరిగినట్లు విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయని, అందువల్లే దర్యాప్తును కొనసాగించామని తెలిపింది. వాటన్నింటినీ చార్జిషీట్లలో పొందుపర్చామని పేర్కొంది. అందువల్ల ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని ప్రత్యేకంగా పరిగణించి, విడిగా దర్యాప్తు చేయడానికి అనుమతించాలని ఈడీకి చెందిన ఓ అధికారి అభిప్రాయపడ్డారు. ట్రయల్ కోర్టు కూడా మనీలాండరింగ్ కేసులో ఈ నిర్ణయం తీసుకోలేదని, అనుమతిస్తే తమ వాదనలు కొనసాగిస్తామని వివరించారు. అయితే, పీఎంఎల్‌ఏ చట్టం ప్రకారం ఈడీ స్వతంత్రంగా క్రిమినల్ కేసు నమోదు చేయలేదు. సీబీఐ, పోలీసుల సిఫారసు లేదా ఫిర్యాదు ఉండాల్సిందే. విజయ్ మదన్‌లాల్(2022) కేసులో సుప్రీంకోర్టు తీర్పును బట్టి ఏదైనా అవినీతి కేసులో నిర్దోషిగా తీర్పు వస్తే దానికి అనుబంధంగా ఉన్న ఈడీ కేసు కూడా వీగిపోతుంది. ఢిల్లీ ఎక్సైజ్ కేసు కూడా అలాంటిదే ముందుగా సీబీఐ(2022 ఆగస్టు 17) అవినీతి కేసు నమోదు చేసింది. తర్వాత ఈడీ మనీలాండరింగ్ కోణంలో కేసు(2022 ఆగస్టు 22) పెట్టింది. కానీ, విశ్వసనీయ ఆధారాలు ఉన్నందున ఈ కేసులో మనీలాండరింగ్ కోణాన్ని ప్రత్యేకంగా చూడాలని ఈడీ అధికారి అన్నారు.
ఈ వార్తలూ చదవండి
ఏఐ వల్లే 4 వేల మందిని తీసేస్తున్నాము: జాక్ డోర్సీ
కృత్రిమ మేధకు భయపడం: టీసీఎస్ సీఈఓ