మాజీ గవర్నర్, విద్యావేత్త డి.వై.పాటిల్ కన్నుమూత
ABN , Publish Date - Aug 05 , 2026 | 06:14 AM
ప్రముఖ విద్యావేత్త, బిహార్, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల మాజీ గవర్నర్ డి.వై.పాటిల్(90) మంగళవారం కన్నుమూశారు...
ముంబయి,ఆగస్టు4: ప్రముఖ విద్యావేత్త, బిహార్, పశ్చిమ బెంగాల్, త్రిపుర రాష్ట్రాల మాజీ గవర్నర్ డి.వై.పాటిల్(90) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పశ్చిమ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో ఉన్న స్వగృహంలో తుది శ్వాస విడిచారు. 1967 నుంచి 1978 వరకు మహారాష్ట్ర శాసనసభ సభ్యుడిగా పనిచేసిన పాటిల్ ఆ తర్వాత తన దృష్టిని పూర్తిగా విద్యారంగం వైపు మళ్లించారు. 1983లో ఆయన స్థాపించిన డి.వై.పాటిల్ గ్రూప్ నేడు ముంబయి, పుణె, కొల్హాపూర్‌లలో 160కి పైగా విద్యాసంస్థలు, డీమ్డ్ వర్సిటీలు, అత్యాధునిక వైద్య, క్రీడా వసతులను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వం 1991లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.
ఇవి కూడా చదవండి..
ఇజ్రాయెల్‌కున్న గొప్ప స్నేహితుల్లో మోదీ ఒకరు: బెంజమిన్ నెతన్యాహు
ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. విచారణ అనంతరం విడుదల చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశం..