Share News

తరగతి గదిలో హెడ్‌మాస్టర్ పాడు పనులు.. గోడలపై గుట్కా ఊసి..

ABN , Publish Date - Aug 09 , 2026 | 07:55 AM

పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు తాగి స్కూలుకు రావటమే కాకుండా.. గుట్కా ఊసి తరగతి గదిని భ్రష్టుపట్టించాడు. గుట్కా మరకలతో పాడైన గదిని పిల్లలతో క్లీన్ చేయిస్తున్నాడు.

తరగతి గదిలో హెడ్‌మాస్టర్ పాడు పనులు.. గోడలపై గుట్కా ఊసి..
Drunk Headmaster

ఇంటర్‌నెట్ డెస్క్: పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ హెడ్ మాస్టర్ నీచానికి పాల్పడ్డాడు. ప్రతిరోజు తాగి స్కూలుకు రావటమే కాకుండా.. గుట్కా ఊసి తరగతి గదిని భ్రష్టుపట్టించాడు. గుట్కా మరకలతో పాడైన గదిని పిల్లలతో క్లీన్ చేయిస్తున్నాడు. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. కోల్ అనే వ్యక్తి మైహర్ జిల్లా, అముర గ్రామంలోని ప్రైమరీ స్కూల్‌లో హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నాడు. కోల్ ప్రతిరోజు తాగి స్కూలుకు వస్తున్నాడు. తరగతి గదిలోనే గుట్కా తిని గోడలపై ఊస్తున్నాడు.


అతడి కారణంగా తరగతి గది చాలా దారుణంగా మారిపోయింది. స్కూలుకు ఎప్పుడుపడితే అప్పుడు రావటమే కాకుండా.. పిల్లలకు చదువు చెప్పకుండా ట్యాబ్‌లెట్‌లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నాడు. తను పాడు చేసిన గోడలను పిల్లలతో బలవంతంగా క్లీన్ చేయిస్తున్నాడు. ఈ విషయాన్ని పిల్లలు తమ తల్లిదండ్రులకు చెప్పారు. వారు మీడియాకు సమాచారం ఇచ్చారు. ఓ నేషనల్ మీడియా స్కూలుకు వెళ్లగా.. కోల్ తరగతి గదిలో గుట్కా నములుతూ.. ట్యాబ్‌లో వీడియోలు చూస్తున్నాడు. గోడలపై ఉన్న గుట్కా మరకల గురించి మీడియా అతడిని అడగ్గా.. ‘దాన్ని క్లీన్ చేయిస్తాను’ అని చెప్పాడు.


పిల్లల తల్లిదండ్రులు నేషనల్ మీడియా ముందు తమ ఆవేదనను చెప్పుకున్నారు. కోల్ కారణంగా తమ పిల్లలు మానసికంగా, శారీరకంగా నరకం చూస్తున్నారని అన్నారు. స్కూల్‌లో చదువుతో పాటు మధ్యాహ్న భోజనం కూడా అందటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కోల్ వ్యవహారం బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజేశ్ ద్వివేదీ దృష్టికి వెళ్లింది. ఆయన దీనిపై సీరియస్‌గా స్పందించారు. హెడ్ మాస్టర్ కోల్‌కు షోకాజ్ నోటీసులు పంపారు. కోల్‌ను సస్పెండ్ చేసే విషయంపై డీఈఓను సంప్రదించారు.


ఇవి కూడా చదవండి

జడేజా అదిరిపోయే కామెడీ.. నవ్వు ఆపుకోలేకపోయిన కోచ్ గంభీర్!

మంత్రి పదవికి రాజీనామాపై తొలిసారి స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్

Updated Date - Aug 09 , 2026 | 08:33 AM