Share News

ఎఫ్‌బీఐ మాజీ చీఫ్‌ మృతిపై ట్రంప్‌ హర్షం

ABN , Publish Date - Mar 23 , 2026 | 06:59 AM

ఎఫ్‌బీఐ మాజీ అధిపతి రాబర్ట్‌ ముల్లర్‌ మృతిపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’లో స్పందిస్తూ...

ఎఫ్‌బీఐ మాజీ చీఫ్‌ మృతిపై ట్రంప్‌ హర్షం

న్యూఢిల్లీ, మార్చి 22: ఎఫ్‌బీఐ మాజీ అధిపతి రాబర్ట్‌ ముల్లర్‌ మృతిపై ట్రంప్‌ హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్రంప్‌ తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’లో స్పందిస్తూ.. ‘రాబర్ట్‌ ముల్లర్‌ మరణించారు. అందుకు సంతోషంగా ఉంది. ఆయన ఇక అమాయకులను వేధించలేరు’ అని పోస్టు చేశారు. పార్కిన్సన్‌ వ్యాధితో బాధ పడుతున్న రాబర్ట్‌ ముల్లర్‌ శుక్రవారం సాయంత్రం మరణించారని ఆయన కుటుంబం శనివారం ప్రకటించింది. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయంలో రష్యా జోక్యం, రష్యా-ట్రంప్‌ మధ్య సంబంధాలపై ఏర్పాటైన విచారణ కమిటీ అధిపతిగా పని చేసిన ముల్లర్‌.. ట్రంప్‌ను వేధించారని విమర్శలున్నాయి. ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా జార్జ్‌.డబ్ల్యూ.బుష్‌ హయాంలో నియమితులైన ముల్లర్‌ 12 ఏళ్లు కొనసాగారు. 9/11 ఉగ్ర కుట్ర తర్వాత ఎఫ్‌బీఐని ఉగ్రవాద వ్యతిరేక దర్యాప్తు సంస్థగా రూపుదిద్దడంలో కీలక పాత్ర పోషించారు.

ఇవి కూడా చదవండి

ప్రధాని మోదీ అరుదైన రికార్డ్.. అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

ఐపీఎల్ 2026: వారి బ్యాటింగ్ అదుర్స్.. కానీ టైటిల్ మాత్రం గెలవడం కష్టం: రాబిన్ ఉతప్ప

Updated Date - Mar 23 , 2026 | 06:59 AM