Share News

చెన్నై కోసం డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో

ABN , Publish Date - Apr 20 , 2026 | 07:29 AM

తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజధాని నగరం చెన్నై కోసం అధికార డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో తయారు చేసిన...

చెన్నై కోసం డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో

చెన్నై, ఏప్రిల్‌ 19(ఆంధ్రజ్యోతి): తమిళనాడు శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రాజధాని నగరం చెన్నై కోసం అధికార డీఎంకే ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసింది. ‘సూపర్‌ సిక్స్‌’ పేరుతో తయారు చేసిన ఈ మేనిఫెస్టోను ఆ పార్టీ చీఫ్‌, సీఎం స్టాలిన్‌ ఆదివారం చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయమైన అన్నా అరివాలయంలో విడుదల చేశారు. ఆ మేనిఫెస్టోలోని ముఖ్యాంశాలు..

  • తాగునీటి కనెక్షన్లు లేని ప్రాంతాల్లో ఆర్‌వో వాటర్‌, మెట్రో వాటర్‌ కనెక్షన్లు ఉన్న అపార్టుమెంట్‌లకు అంతరాయం లేకుండా నీటి సరఫరా

  • నగరంలోని ప్రతి వీధిని బస్‌స్టాపులు, మెట్రో, సబర్బన్‌ రైల్వే స్టేషన్‌లతో అనుసంధానించేందుకు కొత్తగా వెయ్యి మినీ బస్సులు, ట్రాఫిక్‌ రద్దీని తగ్గించి, ప్రయాణ సమయాన్ని ఆదా చేసేందుకు వీలుగా కృత్రిమేథ(ఏఐ) ఆధారిత ట్రాఫిక్‌ నిర్వహణ

  • ఎన్నూరు నుంచి పూంజేరి వరకు చెన్నై సరిహద్దు రహదారి (చెన్నై బోర్డర్‌ రోడ్‌) వంటి 10 ముఖ్య ప్రాజెక్టులను 2027 నాటికి పూర్తి చేయడం, 2028 నాటికి మెట్రో రైల్‌ విస్తరణ పనులు

  • 2027 నాటికి భూగర్భ, మురుగు, వర్షపునీటి కాల్వల నిర్మాణం పూర్తి

  • రూ.10 వేల కోట్లతో ఏఐ, యానిమేషన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, గేమింగ్‌, ఇమ్మర్సిన్‌ టెక్నాలజీల కోసం గ్లోబల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు.

ఈ వార్తలనూ చదవండి:

శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ

భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో

Updated Date - Apr 20 , 2026 | 07:29 AM