Share News

అన్నాడీఎంకేతో పొత్తు.. అలా అయితేనే మద్దతిస్తామన్న డీఎంకే..

ABN , Publish Date - May 08 , 2026 | 12:09 PM

టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిశారు. మెజార్టీ లేకపోవటం వల్ల టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అంగీకరించటం లేదు. బల నిరూపణ చేసిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తానని తేల్చి చెప్పారు.

అన్నాడీఎంకేతో పొత్తు.. అలా అయితేనే మద్దతిస్తామన్న డీఎంకే..
DMK AIADMK alliance

చెన్నై, మే 8: తమిళనాడులో రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు అవుతున్నా.. కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పాటు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన టీవీకే పార్టీకి ఇబ్బందులు తప్పటం లేదు. ప్రభుత్వం ఏర్పాటుకు అవకాశం ఇవ్వమని కోరుతూ.. టీవీకే అధినేత విజయ్ ఇప్పటికే రెండు సార్లు గవర్నర్‌ను కలిశారు. మెజార్టీ లేకపోవటం వల్ల టీవీకే పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ అంగీకరించటం లేదు. బల నిరూపణ చేసిన తర్వాతే ప్రభుత్వ ఏర్పాటుకు అంగీకరిస్తానని తేల్చి చెప్పారు. దీంతో విజయ్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.


అన్నాడీఎంకేకు డీఎంకే మద్దతు..

మెజార్టీ లేని కారణంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతున్న నేపథ్యంలో.. అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నాయన్న ప్రచారం బాగా జరుగుతోంది. దశాబ్దాల శత్రుత్వాన్ని వీడి ఒక్కటిగా ముందుకు వెళ్లబోతున్నాయన్న టాక్ బాగా వినిపిస్తోంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి డీఎంకే సిద్ధంగా ఉంది. మద్దతు కావాలంటే బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును రద్దు చేసుకోవాలని డీఎంకే షరతు పెట్టింది. అంతేకాదు.. తమతో పాటు కలిసే చిన్న పార్టీలకు కూడా మంత్రి పదవులు ఇవ్వాలని అంటోంది.


అసెంబ్లీ ఎన్నికల్లో ‘విడుదలై చిరుతైగల్ కట్చి’ రెండు సీట్లను గెలుచుకుంది. ఈ రెండు సీట్ల కోసం టీవీకే పార్టీ.. వీసీకే పార్టీని సంప్రదించింది. అయితే, విజయ్ ఆఫర్‌ను ఈ పార్టీ తిరస్కరించింది. డీఎంకే కూటమికి మాత్రమే మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. టీవీకే పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న లెఫ్ట్ పార్టీలను కూడా డీఎంకే కూటమి వైపు తిప్పడానికి ప్రయత్నిస్తోంది. లెఫ్ట్ పార్టీల నాలుగు సీట్ల కోసం చర్చలు జరుపుతోంది. లెఫ్ట్ పార్టీలు మాత్రం విజయ్ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి

దారుణం.. ఐపీఎస్ అధికారి భార్యను హత్య చేసిన పని మనిషి..

నకిలీ విత్తనాలతో మోసం.. తీవ్ర నష్టాల్లో రైతులు

Updated Date - May 08 , 2026 | 12:30 PM