ఉదయనిధి సభలో ‘త్రిష’ నినాదాలు.. డీఎంకే కార్యకర్తల హంగామా
ABN , Publish Date - Aug 03 , 2026 | 05:56 PM
కావేరి జలాల సమస్యపై డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తున్న సమయంలో డీఎంకే కార్యకర్తలు ‘త్రిష.. త్రిష..’ అంటూ నినాదాలు చేయడంతో సమావేశంలో హడావుడి నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: కావేరి జలాల సమస్యపై డీఎంకే ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ ధర్నాలో డీఎంకే నేత, ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ ప్రసంగిస్తూ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌కు ఉన్న ఏకైక టెన్షన్ అంటూ ఉదయనిధి వ్యాఖ్యలు చేస్తుండగా, సభలో కొంతమంది డీఎంకే కార్యకర్తలు ఒక్కసారిగా 'త్రిష.. త్రిష..' అంటూ నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో సమావేశ ప్రాంగణంలో కొద్దిసేపు సందడి నెలకొంది. ఉదయనిధి ప్రసంగం కొనసాగుతుండగానే కార్యకర్తల నినాదాలు వినిపించడంతో ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే.. మదురైలో ప్రముఖ నటి త్రిష రాజకీయ ప్రవేశాన్ని కోరుతూ పోస్టర్లు వెలవడం వైరల్‌గా మారింది. మదురై ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ పోస్టర్లలో త్రిష రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తూ సందేశాలు కనిపించాయి. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీపై సోషల్ మీడియా, రాజకీయ వర్గాల్లో మరోసారి చర్చ మొదలైంది. అయితే త్రిష ఇప్పటివరకు తన రాజకీయ ప్రవేశంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Also Read:
మలేషియా, సింగపూర్ టూర్.. హైదరాబాద్ నుంచి IRCTC స్పెషల్ టూర్
బంకీపూర్ ఉపఎన్నికలో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం