Share News

దిశా సాలియన్‌ మృతి కేసు.. ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్‌ నోటీసు!

ABN , Publish Date - Sep 18 , 2026 | 04:37 AM

దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ అనుమానాస్పద మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేకు రూ. 500 కోట్ల లీగల్‌ నోటీసు జారీ అయింది. ఆయనతో పాటు ఎన్‌సీపీనేత, మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు కూడా నోటీసులు అందాయి.

దిశా సాలియన్‌ మృతి కేసు..  ఆదిత్య ఠాక్రేకు రూ.500 కోట్ల లీగల్‌ నోటీసు!
CBI

ముంబై, సెప్టెంబరు 17: దివంగత బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మాజీ మేనేజర్‌ దిశా సాలియన్‌ అనుమానాస్పద మృతి కేసులో మహారాష్ట్ర మాజీ మంత్రి, శివసేన(యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రేకు రూ. 500 కోట్ల లీగల్‌ నోటీసు జారీ అయింది. ఆయనతో పాటు ఎన్‌సీపీనేత, మాజీ హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌కు కూడా నోటీసులు అందాయి. కుమార్తె మరణంపై తాను చేస్తున్న న్యాయపోరాటాన్ని రాజకీయ ప్రేరేపిత చర్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారని, తప్పుడు ఆరోపణలతో ఇద్దరు నేతలు తన ప్రతిష్ఠ దిగజార్చారని ఆరోపిస్తూ దిశా సాలియన్‌ తండ్రి సతీశ్‌ నష్టపరిహారం కోరారు. తనకు క్షమాపణలు చెబుతూ అన్ని ప్రధాన పత్రికలు, డిజిటల్‌ మీడియా వేదికల్లో ప్రకటనలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. 2020 జూన్‌ 8న ముంబైలోని ఓ భవనం పైనుంచి పడి దిశా సాలియన్‌ మృతి చెందిన సంగతి తెలిసిందే.


తొలుత ఇందులో ఎలాంటి నేరకోణం లేదని చెప్పిన దిశ తండ్రి, ఘటనపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ ఇటీవల బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ముఖ్యంగా ఆదిత్య ఠాక్రే, నటులు సూరజ్‌ పంచోలి, డినో మోరియాలతో పాటు పలువురు ప్రముఖులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. ఈ పరిణామాలతో దాదాపు ఆరేళ్ల తర్వాత ఈ కేసు దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. ఆదిత్యఠాక్రే పాత్రపై విచారణ అవసరమని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొంది. కాగా, ఈ ఆరోపణలపై ఆదిత్యఠాక్రే స్పందిస్తూ.. తనకు దిశా సాలియన్‌తో ఎలాంటి పరిచయం లేదని స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

కేసీఆర్ కుటుంబ ఆస్తులపై విచారణ జరగాల్సిందే.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

ప్రజాపాలన దినోత్సవం.. జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్

Updated Date - Sep 18 , 2026 | 04:38 AM