Share News

దివ్యాంగులకు 3-5 ఏళ్ల టోల్‌ మినహాయింపు

ABN , Publish Date - Oct 02 , 2026 | 03:57 AM

దివ్యాంగుల వాహనాలకు ఇచ్చే టోల్‌ మినహాయింపు ఫాస్టాగ్‌ల కాలపరిమితి.. వైకల్య శాతం ఆధారంగా మారనుంది.

దివ్యాంగులకు 3-5 ఏళ్ల టోల్‌ మినహాయింపు
toll

వైకల్య శాతం ఆధారంగా ఫాస్టాగ్‌ల జారీ

న్యూఢిల్లీ, అక్టోబరు 1: దివ్యాంగుల వాహనాలకు ఇచ్చే టోల్‌ మినహాయింపు ఫాస్టాగ్‌ల కాలపరిమితి.. వైకల్య శాతం ఆధారంగా మారనుంది. ఇందుకు సంబంధించి సవరించిన నిబంధనలను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖవిడుదల చేసింది. ఇప్పటి వరకు వీరు ఏడాదికోసారి తమ ఫాస్టాగ్‌లను రెన్యూవల్‌ (పునరుద్ధరణ) చేసుకోవాల్సి ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం.. 70శాతం నుంచి 100శాతం వరకు వైకల్యం కలిగిన వారికి ఐదేళ్లు చెల్లుబాటయ్యే ‘ఎగ్జెంప్టెడ్‌ ఫాస్టాగ్‌’ను జారీ చేస్తారు. ఒకవేళ వైకల్యం 40-70శాతం మధ్య ఉంటే మూడేళ్ల కాలవ్యవధితో ఫాస్టాగ్‌ ఇస్తారు. కాల వ్యవధి ముగిసిన తర్వాత అప్పటికి వారి వైకల్య స్థితి ఆధారంగా రెన్యూవల్‌ చేస్తారు.

ఈ వార్తలు కూడా చదవండి

మహా' విషాదం.. సముద్రంలో మునిగి 8 మంది విద్యార్థుల మృతి

నాడు నానీ.. నేడు మచ్చార్.. ఇజ్రాయెలీలకు అండగా భారతీయులు

Updated Date - Oct 02 , 2026 | 03:59 AM