Share News

ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకేను పిలవండి!

ABN , Publish Date - May 09 , 2026 | 05:50 AM

తమ పార్టీ తరఫున ఎన్నికైన మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్‌ టీవీకేకు మద్దతిచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ జరపాలని ‘అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం’ (ఏఎంఎంకే) అధినేత...

ప్రభుత్వ ఏర్పాటుకు అన్నాడీఎంకేను పిలవండి!

  • గవర్నర్‌కు ఏఎంఎంకే అధినేత దినకరన్‌ లేఖ

చెన్నై, మే 8 (ఆంధ్రజ్యోతి): తమ పార్టీ తరఫున ఎన్నికైన మన్నార్గుడి ఎమ్మెల్యే కామరాజ్‌ టీవీకేకు మద్దతిచ్చినట్లు మీడియాలో వచ్చిన వార్తలపై విచారణ జరపాలని ‘అమ్మామక్కల్‌ మున్నేట్ర కళగం’ (ఏఎంఎంకే) అధినేత దినకరన్‌ గవర్నర్‌ అర్లేకర్‌కు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం రాత్రి 9.50 గంటలకు గవర్నర్‌తో భేటీ అయిన దినకరన్‌.. తాము ఎన్‌డీఏ సీఎం అభ్యర్థిగా వున్న పళనిస్వామికి మద్దతు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటులో టీవీకే విఫలమైనందున.. పళనిస్వామిని ఆహ్వానించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు దినకరన్‌, కామరాజ్‌ సంతకాలు చేసిన లేఖను కూడా గవర్నర్‌కు అందజేశారు. అనంతరం లోక్‌భవన్‌ వెలుపల దినకరన్‌ మాట్లాడుతూ... శుక్రవారం సాయంత్రం విజయ్‌ గవర్నర్‌కు ఇచ్చిన ఎమ్మెల్యేల జాబితాలో తమ ఎమ్మెల్యే పేరు కూడా ఉన్నట్లు వెలువడిన వార్తలు చూసి గవర్నర్‌ను కలిశామన్నారు. ఒకవేళ విజయ్‌ నిజంగా గవర్నర్‌కు తమ ఎమ్మెల్యే లేఖ ఇచ్చినట్లయితే.. ఆ లేఖ ఫోర్జరీదైనా అయివుండాలి, లేదా ఆ ఎమ్మెల్యే డబ్బుకు అమ్ముడుపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశానన్నారు. ఇదిలా ఉండగా... అర్ధరాత్రి తన పార్టీ ఎమ్మెల్యే కామరాజ్‌తో కలిసి దినకరన్‌ మరోసారి లోక్‌భవన్‌కు వెళ్లారు. తన మద్దతు అన్నాడీఎంకేకు మాత్రమే ఉంటుందని, టీవీకేకు మద్దతు ఇచ్చినట్లుగా ప్రచారంలో ఉన్న లేఖ నిజం కాదని ఎమ్మెల్యే స్వయంగా గవర్నర్‌కు వివరించారు.

ఇవి కూడా చదవండి...

పుదుచ్చేరి గవర్నర్‌ను కలిసిన రంగస్వామి.. 13న ప్రమాణస్వీకారం

కేరళం సీఎం రేసులో కేసీ వేణుగోపాల్.. 11న ప్రమాణస్వీకారం

Updated Date - May 09 , 2026 | 05:50 AM