కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ నకిలీ లేఖ వైరల్..
ABN , Publish Date - Jul 23 , 2026 | 12:52 PM
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ ఓ నకిలీ లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ లేఖ కొన్ని గంటల్లోనే అన్ని సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పందించింది.
ఢిల్లీ: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ ఓ నకిలీ లేఖ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ లేఖ కొన్ని గంటల్లోనే అన్ని సోషల్ మీడియా వేదికల్లో వైరల్‌గా మారింది. దీనిపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్ బృందం స్పందించింది. కేంద్ర మంత్రి రాజీనామా వార్తలను పూర్తిగా ఖండించింది. ధర్మేంద్ర ప్రధాన్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా నకిలీదేనని తేల్చి చెప్పింది.
దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న లేఖ పూర్తిగా ఫేక్ అని స్పష్టం చేసింది. ప్రజలు, విద్యార్థులు, యువత ఎవరూ ఇటువంటి అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేసింది. ఎవరో ఆకతాయిలు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పేరుతో నకిలీ రాజీనామా లేఖను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్రం పేర్కొంది. మరోవైపు, నకిలీ లేఖలు సృష్టించి తప్పుడు ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి
కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే.. పాకిస్థాన్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
ముంబై నిరసనల్లో పోలీస్ వ్యాన్‌ను అడ్డుకున్న యువతి.. వీడియో వైరల్