Share News

మళ్లీ తెరపైకి ‘ధర్మస్థల’ హత్యాచారం కేసు

ABN , Publish Date - Sep 22 , 2026 | 02:30 AM

దాదాపు 14 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ‘ధర్మస్థల’ అత్యాచారం-హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2012లో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఉజిరెలో సౌజన్య అనే యువతి హత్యాచారానికి గురైన కేసులో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

మళ్లీ తెరపైకి ‘ధర్మస్థల’ హత్యాచారం కేసు
SUPREME COURT

  • 14 ఏళ్ల నాటి సౌజన్య కేసుపై తిరిగి దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం

  • మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలని నిర్దేశం

బెంగళూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): దాదాపు 14 ఏళ్లుగా మిస్టరీగా ఉన్న ‘ధర్మస్థల’ అత్యాచారం-హత్య కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 2012లో కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లా ఉజిరెలో సౌజన్య అనే యువతి హత్యాచారానికి గురైన కేసులో మళ్లీ దర్యాప్తు చేపట్టాలని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. మూడు నెలల్లో తాజా దర్యాప్తు పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది. మునుపటి దర్యాప్తులో భాగమైన అధికారులు కొత్త దర్యాప్తు బృందంలో ఉండకూడదని న్యాయమూర్తి జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ధర్మస్థల సమీపంలోని ఉజిరెలో ఉన్న ఎస్‌డీఎం కళాశాల పీయూ విద్యార్థిని సౌజన్య (17) 2012 అక్టోబరులో కిడ్నా్‌పనకు గురైంది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారం చేసి, క్రూరంగా హత్య చేశారు. ఈ కేసు దర్యాప్తును తొలుత కర్ణాటక సీఐడీ విభాగం చేపట్టగా, ఆతర్వాత సీబీఐకి బదిలీ చేశారు. కానీ సౌజన్య మరణానికి కారణమైన నిందితులను మాత్రం గుర్తించలేకపోయారు.తన కుమార్తె కేసులో తాజా దర్యాప్తు చేపట్టాలని బాధితురాలి తల్లి కుసుమావతి గౌడ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం పై మేరకు స్పందించింది.

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ విద్యార్థి విభాగం కొంప ముంచిన టికెట్ గొడవ

చెక్కులు దొంగిలించి రూ.46 కోట్లు డ్రా.. తోబుట్టువులపై నటి రాధ ఫిర్యాదు

Updated Date - Sep 22 , 2026 | 02:30 AM