Share News

ధనుష్‌ కొత్త పార్టీ ‘తమిళగ ఎళుచ్చి కళగం’?

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:28 AM

ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ రాజకీయ అరంగేట్రానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆయన ‘తమిళగ ఎళుచ్చి కళగం (తమిళనాడు పురోగమన పార్టీ)’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిసింది.

ధనుష్‌ కొత్త పార్టీ ‘తమిళగ ఎళుచ్చి కళగం’?
dhanshu

ఈసీ వద్ద నమోదు చేయించిన తమిళ నటుడు!

చెన్నై, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ప్రముఖ తమిళ హీరో ధనుష్‌ రాజకీయ అరంగేట్రానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆయన ‘తమిళగ ఎళుచ్చి కళగం (తమిళనాడు పురోగమన పార్టీ)’ పేరుతో కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఆయన తన పార్టీ పేరును ఎన్నికల సంఘం వద్ద నమోదు చేయించినట్లు సమాచారం. ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలనాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సినీ నటుడు విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఐదు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న, పలుమార్లు రాష్ట్రాన్ని ఏలిన డీఎంకే, అన్నాడీఎంకే వంటి పార్టీలు పరాజయం పాలై.. ప్రతిపక్షంలో కూర్చున్నాయి. ఈ నేపథ్యంలో తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ మాజీ అల్లుడు కూడా అయిన ధనుష్‌ రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు గత కొంతకాలంగా సన్నాహాలు చేసుకుంటున్నారు. తన అభిమాన సంఘాలు రూపొందించుకున్న ప్రత్యేక పతాకాన్ని కూడా ఇటీవల ఆవిష్కరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన ‘తమిళగ ఎళుచ్చి కళగం’ పేరుతో పార్టీని రిజిస్టర్‌ చేయించినట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై ధనుష్‌ అధికారిక ప్రకటన చేస్తారని ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి

ఎవ్వరూ తప్పించుకోలేరు.. రాహుల్ గాంధీ హెచ్చరిక

రాజకీయ పార్టీల ప్రతినిధుల భేటీపై ఈసీ కీలక ప్రకటన

Updated Date - Oct 07 , 2026 | 05:29 AM