డ్రోన్ దిగుమతికి లంచం.. డీజీసీఏ అధికారి అరెస్టు
ABN , Publish Date - Apr 20 , 2026 | 06:28 AM
డ్రోన్ దిగుమతి కోసం రూ.2.5 లక్షలు లంచంగా తీసుకున్న పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సీనియర్ అధికారిని...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: డ్రోన్ దిగుమతి కోసం రూ.2.5 లక్షలు లంచంగా తీసుకున్న పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) సీనియర్ అధికారిని అరెస్టు చేసినట్టు ఆదివారం సీబీఐ అధికారులు తెలిపారు. డ్రోన్ దిగుమతి కోసం ఓ ప్రయివేటు ఏరోస్పేస్ సంస్థకు అనుమతి ఇచ్చేందుకు డీజీసీఏ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ముదావత్ దేవులా లంచం తీసుకున్నారని చెప్పారు. ఆయనకు ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భరత్ మాథుర్ సహకరించినట్టు తెలిపారు. లంచం సొమ్ము మొత్తాన్ని స్వాఽధీనం చేసుకున్నట్టు చెప్పారు. అనంతరం ఆ అధికారి, ఇతర ప్రయివేటు వ్యక్తుల ఇళ్లల్లో సోదాలు జరపగా రూ.37 లక్షల నగదు, బంగారం, వెండి నాణేలు లభించినట్టు వివరించారు.
ఈ వార్తలనూ చదవండి:
శ్రీలంక ప్రధాని హరిణి అమరసూర్యతో ఉప రాష్ట్రపతి సీ.పీ. రాధాకృష్ణన్ భేటీ
భారత నౌకలపై ఇరాన్ కాల్పులు.. వైరల్‌గా మారిన ఆడియో