బాలీవుడ్ సీనియర్ నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు కన్నుమూత..
ABN , Publish Date - Jul 28 , 2026 | 09:07 PM
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దివంగత నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూశారు.
ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దివంగత నటుడు దేవ్ ఆనంద్ కుమారుడు సునీల్ ఆనంద్ కన్నుమూశారు. జులై 26వ తేదీన 70 ఏళ్ల వయసులో గుండెపోటు కారణంగా లండన్‌లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన మేనకోడలు గీనా నారంగ్ అధికారికంగా ధ్రువీకరించారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. సునీల్ ఆనంద్ మృతిపై బాలీవుడ్ ప్రముఖులు తమ సంతాపం తెలియజేస్తున్నారు.
సునీల్ ఆనంద్ సినీ ప్రస్థానం..
తండ్రి దేవ్ ఆనంద్ స్వయంగా దర్శకత్వం వహించిన 'ఆనంద్ ఔర్ ఆనంద్' చిత్రం ద్వారా సునీల్ ఆనంద్ సినీ రంగ ప్రవేశం చేశారు. 'కార్ థీఫ్', 'మైన్ తేరే లియే' వంటి సినిమాల్లో నటించారు. అయితే, తండ్రి స్థాయిలో స్టార్‌డమ్ సంపాదించుకోలేకపోయారు. దర్శకత్వంపై ఆసక్తితో సునీల్ 'మాస్టర్' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. చివరగా 'వాగేటర్ మిక్సర్' అనే హాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించటంతో పాటు అందులో నటించారు. 2015 నుంచి సినిమాలకు దూరంగా ఉంటున్నారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ ఆత్మను ప్రతిబింబించేలా టీజీఎస్‌టీఏ పేరు..లోగో: మంత్రి కోమటిరెడ్డి
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం