డీలిమిటేషన్‌పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ?
ABN , Publish Date - Aug 21 , 2026 | 12:39 PM
మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రం ఏం చేయనుందన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు సమావేశాలు ముగిసినా ఇప్పటికీ ప్రోరోగ్ చేయకపోవడంపై రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లు విషయంలో కేంద్రం ఏం చేయనుందన్న అంశంపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. ఈ వర్షాకాల సమావేశాల్లోనే బిల్లు పెడతారన్న అంచనాలు మొదట్లో వెలువడినా పేపర్ లీక్ అంశం వివాదాస్పదం కావడంతో డీలిమిటేషన్ అంశం తెరమరుగైనట్టు కనిపించింది. అయితే, డీలిమిటేషన్ కోసం కేంద్రం ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందన్న అంచనాలు ప్రస్తుతం వెలువడుతున్నాయి.
నిన్న దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అమిత్ షా నియోజకవర్గ పునర్‌విభజన అంశాన్ని ప్రస్తావించారు. డీలిమిటేషన్‌ను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం ఈ సమావేశం తరువాత మెత్తబడినట్టు ప్రచారం మొదలైంది. సమావేశం అనంతరం విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత పార్లమెంటరీ ప్రాతినిధ్యంలో రాష్ట్రాల వాటా తగ్గకుండా రక్షణ కల్పించాలని అన్నారు. ఈ దిశగా కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వాలని అన్నారు.
ఇక దక్షిణాది వాటా తగ్గకుండా ఉంటే డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించాల్సిన అవసరం లేదనే అభిప్రాయంలో డీఎంకే కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవలి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 13వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే. ఆ తరువాత సభను ప్రోరోగ్ చేయాల్సి ఉండగా ఇప్పటివరకూ ఆ దిశగా ఎలాంటి చర్య లేకపోవడంతో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్న ఉత్కంఠ పెరిగింది.
ఈ వార్తలనూ చదవండి:
నేను వచ్చానని అద్దె విద్యార్థులను తీసుకొచ్చారు: అభిజీత్ సంచలన ఆరోపణలు..
పాక్ కాదు.. చైనానే.. భారత ఆర్మీ మాజీ చీఫ్ నరవణే కీలక వ్యాఖ్యలు