Share News

హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది మృతి

ABN , Publish Date - Jun 03 , 2026 | 12:49 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా.. పది మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 21 మంది మృతి
Delhi restaurant fire

ఇంటర్‌నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ఓ హోటల్‌లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా 21 మంది చనిపోగా.. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. మల్వియా నగర్‌లోని, హౌజ్ రాణీ లైన్‌లో ఐదంతస్తుల భవనం ఉంది. భవనం బేస్‌మెంట్‌లో ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ ఉంది. బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో రెస్టారెంట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.


మంటల్లో చిక్కుకుని 21 మంది ప్రాణాలు కోల్పోయారు. 20 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో హోటల్‌లో 40 మందికి పైగా జనం ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది మధ్య ఆసియా, ఆఫ్రికాకు చెందిన వారు ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది.


అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

హోటల్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇస్తామని తెలిపారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి

తోతాపురికి ఈసారీ దక్కని గిట్టుబాటు ధర

అమెరికా రాజధానిలో గన్నికి ఆత్మీయ సత్కార

Updated Date - Jun 03 , 2026 | 01:31 PM