సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా కేసు క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగింత!
ABN , Publish Date - Oct 21 , 2026 | 06:46 AM
కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాపై నమోదైన ఓ కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాపై నమోదైన ఓ కేసును ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. నిరసన ప్రదేశంగా జంతర్‌మంతర్‌ను కేంద్రం డీనోటిఫై చేసిన తరువాత కూడా వారు అక్కడ నిరసనకు దిగినందుకు ఈ కేసు నమోదైంది. ఇందుకు సంబంధించిన మరో కేసుపై విచారణను ఢిల్లీ పోలీసులు అంతకుముందే క్రైమ్ బ్రాంచ్‌కు అప్పగించారు. అక్టోబర్ 13న దాస్, రాంకాతో పాటు మరో 11 మంది సీజేపీ సభ్యులు డీనోటిఫైడ్ ప్రాంతమైన జంతర్‌మంతర్ వద్ద నిరసనకు ప్రయత్నించారు. బారికేడ్లు ఎక్కిన వారిని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకుని, అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ అయ్యాయి. అంతకుముందు రాసిచ్చిన బాండ్స్‌ను ఉల్లంఘించినందుకు అక్టోబర్ 14న స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారికి ఐదో రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఆ తరువాత సోమవారం కస్టడీని మరో రెండు రోజుల పాటు పోడిగించారు. శాంతికి విఘాతం కలిగించబోమంటూ అక్టోబర్ 10న ఇచ్చిన బాండ్‌ను ఉల్లంఘించడం, పోలీసు బారికేడ్లు దాటుకుని డీనోటిఫైడ్ ప్రాంతంలోకి వెళ్లడంతో వారిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి.
దాస్, రాంకాలకు మద్దతుగా సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే దసరా నాడు ఎక్స్ వేదికగా ఓ భావోద్వేగపూరిత వీడియోను షేర్ చేశారు. వారిద్దరూ తనకు సోదర సమానులని అన్నారు. సీజేపీలో నిర్ణయాలు తీసుకునేది వారేనని అన్నారు. తానూ వారినే అనుసరిస్తుంటానంటూ ప్రశంసలు కురిపించారు.
ఈ వార్తలనూ చదవండి:
ఆత్మనిర్భర్ భారత్ సాధనే మన లక్ష్యం కావాలి: ప్రధాని మోదీ
ఆపరేషన్ కంప్లీటెడ్.. హ్యాండ్లర్లకు షూటర్ల మెసేజ్