Share News

ఢిల్లీలో పింక్ ఫోర్స్ రంగంలోకి.. మహిళల భద్రతకు పోలీసుల ప్రత్యేక వ్యూహం

ABN , Publish Date - Oct 10 , 2026 | 10:34 AM

ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆందోళనల సమయంలో మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేక మహిళా బలగం ‘పింక్ ఫోర్స్‌’ను రంగంలోకి దించారు.

ఢిల్లీలో పింక్ ఫోర్స్ రంగంలోకి.. మహిళల భద్రతకు పోలీసుల ప్రత్యేక వ్యూహం
Delhi Police Pink Force

ఇంటర్నెట్ డెస్క్: ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న నిరసనల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు మహిళల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ఢిల్లీ పోలీసుల ప్రత్యేక మహిళా బలగం ‘పింక్ ఫోర్స్‌’ను రంగంలోకి దించారు. గతంలో జరిగిన ఆందోళనల సమయంలో మహిళా పోలీసు సిబ్బందికి ఎదురైన దురుసు ప్రవర్తన.. ఇతర ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కీలక ప్రాంతాల్లో ఈ ప్రత్యేక బృందాలను మోహరించినట్లు సమాచారం.

నిరసన ప్రదేశాలతో పాటు రద్దీగా ఉండే కూడళ్లు.. ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో మహిళా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆందోళనల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిరసనకారుల కదలికలను గమనిస్తూ అవసరమైన సందర్భాల్లో తగిన చర్యలు తీసుకునేలా పోలీసు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది.


మహిళా సిబ్బందితో కూడిన పింక్ ఫోర్స్‌ ప్రధానంగా నిరసన ప్రాంతాల్లో భద్రతను పర్యవేక్షించడం.. మహిళలకు సంబంధించిన సమస్యలపై తక్షణమే స్పందించి పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండ చూస్తుంది. నిరసనకారులను నియంత్రించే క్రమంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ.. పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు తలెత్తకుండా చర్యలు చేపడుతున్నారు. మహిళా పోలీసులు విధులు నిర్వర్తించే ప్రాంతాల్లో భద్రతాపరమైన సవాళ్లను తగ్గించడంతో పాటు..అవసరమైన సమయంలో మహిళా నిరసనకారులతో సమన్వయం చేసుకోవడంలో ఈ బృందాలు కీలక పాత్ర పోషించనున్నాయి. జంతర్ మంతర్ వంటి సున్నితమైన ప్రాంతాల్లో నిరసనలు జరిగే సమయంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేయడమే లక్ష్యంగా పింక్ ఫోర్స్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి

ఎల్‌నినో ప్రభావం.. 2027 నాటికి భారత్‌లో వంటనూనెల కొరత..

భారత మూలాలున్న మహిళలకు నోబెల్ శాంతి పురస్కారం

Updated Date - Oct 10 , 2026 | 11:22 AM