Share News

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:39 PM

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు విచారణనుంచి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మను తొలగించాలని కోరుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు పిటిషన్‌పై విచారణ జరిపింది.

ఢిల్లీ లిక్కర్‌ కేసు.. హైకోర్టులో స్వయంగా వాదనలు వినిపించిన కేజ్రీవాల్‌
Delhi liquor case

న్యూఢిల్లీ, ఏప్రిల్ 13: ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసు విచారణనుంచి జస్టిస్‌ స్వర్ణకాంత శర్మను తొలగించాలని కోరుతూ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ హైకోర్టులో పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం హైకోర్టు పిటిషన్‌పై విచారణ జరిపింది. కేజ్రీవాల్ స్వయంగా తన వాదనలు వినిపించారు. విచారణ ప్రక్రియలో పక్షపాతం ఉండవచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా సాక్షుల వాంగ్మూలాలపై చేసిన వ్యాఖ్యలు తనను దోషిగా, అవినీతిపరుడిగా చిత్రీకరించేలా ఉన్నాయని కేజ్రీవాల్ కోర్టుకు తెలిపారు.


దర్యాప్తు సంస్థలపై కూడా కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి దర్యాప్తు సంస్థలు మొదట సాక్షులను అరెస్టు చేసి.. ఆ తర్వాత ఇతరులను ఇరికించేలా వారి నుండి బలవంతంగా వాంగ్మూలాలను తీసుకుంటున్నాయని అన్నారు.


కాగా, ఈడీ నమోదు చేసిన రెండు వేర్వేరు కేసుల్లో కేజ్రీవాల్‌ను రౌస్ ఎవెన్యూ కోర్టు ఇటీవల నిర్దోషిగా ప్రకటించింది. దీనిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరెక్టరేట్ హైకోర్టులో సవాలు చేసింది. ఈడీ పిటిషన్‌పై జస్టిస్ స్వర్ణకాంత శర్మ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఏప్రిల్ 6వ తేదీన విచారణ జరిపింది. ఈ సందర్భంగా, కేజ్రీవాల్‌ సహా పలువురు దాఖలు చేసిన రెక్యూసల్‌ పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని సీబీఐకి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.


ఇవి కూడా చదవండి

ఢిల్లీలో 20 మంది కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యేల మకాం.. డీకే హెచ్చరిక

వివాదంలో స్టార్ క్రికెటర్.. ప్రైవేట్ మెసేజ్‌లు లీక్ చేసిన నటి!

Updated Date - Apr 13 , 2026 | 04:47 PM