Share News

ఢిల్లీలో జడ్జి ఆత్మహత్య!

ABN , Publish Date - May 02 , 2026 | 07:59 PM

ఢిల్లీలో ఒక యువ జడ్జి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. సీలింగ్ ఫ్యాన్ నుంచి వేలాడుతున్న ఆయన మృతదేహాన్ని గుర్తించిన బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు.

ఢిల్లీలో జడ్జి ఆత్మహత్య!
New Delhi

ఇంటర్నెట్ డెస్క్: దక్షిణ ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ప్రాంతంలో జడ్జి ఒకరు ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. జడ్జి అమన్ కుమార్ శర్మ (30) మృతదేహాన్ని ఆయన ఇంట్లో చూసిన బంధువు ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. నేటి మధ్యాహన్నం 1.45 గంటల సమయంలో తమకు కాల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని వారు పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అసలేం జరిగిందో తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


జడ్జి అమన్ కుమార్ శర్మ 2018లో సింబయాసిస్ లా స్కూల్‌‌ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2019 జూన్ 19న ఢిల్లీ జుడీషియల్ సర్వీసెస్‌లో చేరారు. తన కెరీర్‌లో ఆయన పలు కోర్టుల్లో వివిధ సివిల్, క్రిమినల్ కేసులను డీల్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించారు.


ఈ వార్తలనూ చదవండి:

బెంగాల్‌లో కౌంటింగ్‌కు అదనపు పరిశీలకులు.. ఈసీ మరో కీలక నిర్ణయం

200 ప్లస్ సీట్లతో మనమే గెలుస్తాం.. మమతా బెనర్జీ ధీమా

Updated Date - May 02 , 2026 | 08:18 PM