Share News

ఆర్‌టీఐ దరఖాస్తుల తిరస్కరణలో ఢిల్లీ హైకోర్టు టాప్‌!

ABN , Publish Date - Feb 13 , 2026 | 06:03 AM

సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద చేసే దరఖాస్తులను అత్యధిక సంఖ్యలో తిరస్కరించిన స్వతంత్ర న్యాయసంస్థలు, ప్రభుత్వ శాఖల జాబితాలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు...

ఆర్‌టీఐ దరఖాస్తుల తిరస్కరణలో ఢిల్లీ హైకోర్టు టాప్‌!

  • సుప్రీంకోర్టు, కేంద్ర హోం శాఖ కూడా..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద చేసే దరఖాస్తులను అత్యధిక సంఖ్యలో తిరస్కరించిన స్వతంత్ర న్యాయసంస్థలు, ప్రభుత్వ శాఖల జాబితాలో ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టు, కేంద్ర హోం శాఖ అగ్రస్థానంలో ఉన్నాయి. 2024-25లో కేంద్ర ఆర్థిక శాఖ కూడా చాలా అప్లికేషన్లను తోసిపుచ్చినట్లు కేంద్ర సమాచార కమిషన్‌ (సీఐసీ) తన తాజా వార్షిక నివేదికలో వెల్లడించింది. జాతీయ భద్రత, ఇతర రక్షిత ప్రయోజనాలకు సంబంధించిన అంశాల సమాచారాన్ని ఇవ్వకుండా ఆర్‌టీఐ చట్టంలోని సెక్షన్‌ 8(1) కింద మినహాయింపులున్నాయి. దీనిని ప్రయోగించి 28,924 దరఖాస్తులను తిరస్కరించినట్లు సీఐసీ తెలిపింది. వివిధ కారణాలతో తిరస్కరించిన అన్ని అప్లికేషన్లలో ఇది దాదాపు సగం (49.88%) కావడం గమనార్హం. ఢిల్లీ హైకోర్టుకు 2,089 ఆర్‌టీఐ దరఖాస్తులు అందగా.. వాటిలో 22.88ు దరఖాస్తులను తిరస్కరించింది. సుప్రీంకోర్టుకు 5,017 ఆర్‌టీఐ అప్లికేషన్లు అందగా.. 689ని (13.73%) తోసిపుచ్చింది. కేంద్ర హోం శాఖకు 58,130 దరఖాస్తులు రాగా.. తిరస్కరించినవి 7,750 (13.33%) ఉన్నాయి.

ఇవి కూడా చదవండి..

114 రఫేల్ యుద్ధ విమానాలు, 6 పీ8ఐ విమానాలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

స్పీకర్ ఛాంబర్‌లో కాంగ్రెస్ ఎంపీల వీరంగం.. వీడియో షేర్ చేసిన కిరణ్ రిజిజు

Updated Date - Feb 13 , 2026 | 06:03 AM