పోలీసులు బాడీ కెమెరాలు ధరించాలని ఆదేశించలేం
ABN , Publish Date - Oct 08 , 2026 | 04:21 AM
నిరసనలు, ఆందోళనలను నియంత్రించే సందర్భాల్లో ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) బలగాలు బాడీ వోర్న్ కెమెరాలు ధరించేలా(మెడలో లేదా చొక్కా జేబుకు పెట్టేవి) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 7: నిరసనలు, ఆందోళనలను నియంత్రించే సందర్భాల్లో ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) బలగాలు బాడీ వోర్న్ కెమెరాలు ధరించేలా(మెడలో లేదా చొక్కా జేబుకు పెట్టేవి) ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ అంశంలో ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల్సినంత అవసరం ఉందని భావించడం లేదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘ఈ విషయంలో చట్టం చేయాలని ఎందుకు ఆదేశించాలి? ఎప్పుడు కెమెరాలు ధరించాలన్న విషయంలో చట్టపరమైన నిబంఽధనలు ఇప్పటికే అమల్లో ఉన్నాయి. కేవలం ఢిల్లీ పోలీసుల గురించే కాకుండా, మేము మొత్తం పోలీసుల గురించి ఆలోచిస్తున్నాం. ఎందుకంటే దీని ప్రభావం అంతటా ఉంటుంది’’అని ధర్మాసనం పేర్కొంది. అయితే, పిటిషనర్ చాహత్ రాఘవ్ అభ్యర్థనను పరిశీలించాలని కేంద్రాన్ని ఆదేశించింది.
ఈ వార్తలు కూడా చదవండి
అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.
యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.