Share News

ఆరుగురు సీబీఐ అధికారులపై క్రిమినల్‌ చర్యలు!

ABN , Publish Date - Oct 08 , 2026 | 04:12 AM

న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు చేశారనే ఆరోపణలపై ఆరుగురు సీబీఐ అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఆరుగురు సీబీఐ అధికారులపై క్రిమినల్‌ చర్యలు!
delhihighcourt

తప్పుడు ప్రకటనలు చేసినందుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశం

న్యూఢిల్లీ, అక్టోబరు 7: న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రకటనలు చేశారనే ఆరోపణలపై ఆరుగురు సీబీఐ అధికారులపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌(ఐఆర్‌ఎస్‌) అధికారి అశోక్‌ కుమార్‌ అగర్వాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ మధు జైన్‌ ధర్మాసనం ఈ మేరకు తీర్పునిచ్చింది. అశోక్‌ కుమార్‌ అగర్వాల్‌పై సీబీఐ అప్పట్లో అక్రమాస్తుల కేసు నమోదు చేసింది. అయితే 2016 జనవరిలో ఆయనపై అభియోగాలకు సంబంధించిన ప్రాసిక్యూషన్‌ అనుమతిని హైకోర్టు చెల్లదని తేల్చడంతో అగర్వాల్‌ ఆ కేసు నుంచి డిశ్చార్జ్‌ (విముక్తి) అయ్యారు. ఆ తర్వాత, తన వద్ద నుంచి సీబీఐ స్వాధీనం చేసుకున్న పత్రాలను తిరిగి ఇవ్వాలని అగర్వాల్‌ కోరారు. అయితే, ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు వీలుగా కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగుతున్నాయంటూ 2016 ఆగస్టు 2న సీబీఐ అధికారులు కోర్టుకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కానీ వాస్తవానికి అప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లాలన్న సీబీఐ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించింది.

ఈ వార్తలు కూడా చదవండి

అదుపులోకి రాహుల్ గాంధీ, ప్రియాంక.. నేలపై పడుకొని ప్రియాంక నిరసన.

యూపీఐ ఛార్జీల వల్ల లావాదేవీలు తగ్గవు: ఆర్బీఐ గవర్నర్ కీలక వ్యాఖ్యలు.

Updated Date - Oct 08 , 2026 | 04:13 AM