ఢిల్లీ హైకోర్టుకు మహిళా రెజ్లర్లు.. బ్రిజ్‌భూషణ్‌కు నోటీసులు జారీ
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:59 AM
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో దిగువ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. లైంగిక వేధింపుల కేసులో దిగువ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ నలుగురు మహిళా రెజ్లర్లు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సోమవారం విచారణ జరిపిన కోర్టు.. బ్రిజ్‌భూషణ్ సహా డబ్ల్యూఎఫ్ఐ మాజీ కార్యదర్శి వినోద్ తోమర్‌కు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 9కి వాయిదా వేసింది.
సెప్టెంబర్ 25న దాఖలు చేసిన క్రిమినల్ అప్పీల్‌లో.. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్, వినోద్ తోమర్‌ను నిర్దోషులుగా ప్రకటించడాన్ని రెజ్లర్లు సవాల్ చేశారు. దిగువ కోర్టు తీర్పు చట్టబద్ధంగా లేదని, కేసులో సాక్ష్యాలను తప్పుగా పరిగణనలోకి తీసుకున్నారని తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. లైంగిక వేధింపులకు గురైన బాధితులు ఎలా ప్రవర్తించాలనే దానిపై పాతకాలపు, మూస ధోరణుల ఆధారంగా కొన్ని అంశాలను పరిశీలించారని మహిళా రెజ్లర్లు తమ అప్పీల్‌లో ఆరోపించారు. బాధితుల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సాక్ష్యాలను నిష్పక్షపాతంగా పరిశీలించాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా తీర్పు ఇచ్చారని వాదించారు.
ఇవి కూడా చదవండి:
ఆసియా గేమ్స్: అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్ రద్దు.. సెమీస్‌కు భారత్
కోహ్లీని అలా వదిలేయాలి.. మ్యాచ్‌లు సులువుగా గెలిపించేస్తాడు: గిల్