Share News

జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు..

ABN , Publish Date - May 19 , 2026 | 01:46 PM

ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముగ్గురికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది.

జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసు.. అరవింద్ కేజ్రీవాల్‌కు నోటీసులు..
Arvind Kejriwal

న్యూఢిల్లీ, మే 19: ఢిల్లీ హైకోర్టు జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసులో అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌కు ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ముగ్గురికీ కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. జస్టిస్ స్వర్ణకాంత శర్మపై వ్యాఖ్యల కేసుపై జస్టిస్ నవీన్ చావ్లా, జస్టిస్ రవీందర్ దుడేజాలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌‌లకు ధర్మాసనం కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. వీరంతా నాలుగు వారాల లోపు సమాధానాన్ని దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. విచారణను ఆగస్టు 4వ తేదీకి వాయిదా వేసింది.


ఇంతకీ ఏం జరిగిందంటే..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును విచారిస్తున్న జస్టిస్ స్వర్ణకాంత శర్మను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, వారి మద్దతుదారులు టార్గెట్ చేశారు. సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు, వీడియోలు పెట్టారు. ఓ విద్యాసంస్థలో జస్టిస్ స్వర్ణకాంత శర్మ మాట్లాడిన పాత వీడియోను ఎడిట్ చేసి, ఆమె ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నట్లుగా తప్పుగా ప్రచారం చేశారు.


ఆమె ఈ కేసును నిష్పక్షపాతంగా విచారించలేరని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆ ప్రచారంపై జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఫైర్ అయ్యారు. తనపై సోషల్‌ మీడియా వేదికగా దుష్ప్రచారం సాగించారనే ఆరోపణలపై గురువారం స్వచ్ఛందంగా కోర్టు ధిక్కరణ చర్యలను ప్రారంభించారు. అదే సమయంలో ఈ కేసు విచారణ నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించారు.


ఇవి కూడా చదవండి..

కేజ్రీవాల్‌పై కోర్టు ధిక్కరణ

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై సీఎం రేవంత్ కీలక సూచనలు

Updated Date - May 19 , 2026 | 03:03 PM