ప్రేమ పేరుతో మోసం.. నిందితుడికి బెయిల్ నిరాకరించిన కోర్టు
ABN , Publish Date - Feb 25 , 2026 | 07:08 PM
ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రియురాలిని మోసం చేసిన కేసులో అరెస్టైన అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడికి ఢిల్లీ హైకోర్టు షాక్ ఇచ్చింది. ప్రియురాలిని మోసం చేసిన కేసులో అరెస్టైన అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి చెందిన ఓ యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలితో శారీరక సంబంధం పెట్టుకున్నాడు. ఆ తర్వాత జాతకాలు కలవలేదన్న సాకుతో పెళ్లికి నిరాకరించాడు.
దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ కేసు పెట్టింది. ఐపీసీ 376, బీఎన్‌ఎస్ సెక్షన్ 69 కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రియుడిని అరెస్ట్ చేశారు. అతడు బెయిల్ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. విచారణ జరిపిన హైకోర్టు అతడికి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. కాలేజీ రోజుల నుంచే ఇద్దరికీ పరిచయం ఉన్నట్లు కోర్టు గుర్తించింది.
వివాహం చేసుకుంటానని అతడు పలు మార్లు ప్రియురాలికి హామీ ఇచ్చినట్లు తేల్చింది. ప్రేమికుల వాట్సాప్ చాట్స్‌ను కోర్టు పరిశీలించింది. నిందితుడు గతంలో జాతకాలు సరిపోయాయని చెప్పిన ఆధారాలు ఉన్నట్లు హైకోర్టు గుర్తించింది. అంతేకాదు.. సన్నిహితంగా ఉన్నపుడు దిగిన ఫోటోలు లీక్ చేస్తానని నిందితుడు యువతిని బెదిరించిన విషయం కూడా కోర్టు దృష్టికి వచ్చింది.
ఇవి కూడా చదవండి
కిలో బొప్పాయి రూ.400, ఆపిల్స్ రూ.500.. పాకిస్థాన్‌లో పళ్ల ధరలు ఏ స్థాయిలో ఉన్నాయంటే..
పినాక మిసైల్.. ఈ బేబీ బ్రహ్మోస్ నిల్వలను భారత్ ఎందుకు పెంచుకుంటోంది..