Share News

పినాక మిసైల్.. ఈ బేబీ బ్రహ్మోస్‌ నిల్వలను భారత్ ఎందుకు పెంచుకుంటోంది..

ABN , Publish Date - Feb 25 , 2026 | 06:37 PM

గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం, గాజా యుద్ధం ప్రపంచ దేశాలకు నేర్పుతున్న పాఠాలు ఏంటి? ఈ యుద్ధాలలో సంపూర్ణ విజేతలు ఉండరు. ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక దేశ ఆర్థిక, పారిశ్రామిక శక్తికి సవాలు విసురుతాయి.

పినాక మిసైల్.. ఈ బేబీ బ్రహ్మోస్‌ నిల్వలను భారత్ ఎందుకు పెంచుకుంటోంది..
Indian defence strategy

గత కొన్నేళ్లుగా జరుగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం, గాజా యుద్ధం ప్రపంచ దేశాలకు నేర్పుతున్న పాఠాలు ఏంటి? ఈ యుద్ధాలలో సంపూర్ణ విజేతలు ఉండరు. ఈ యుద్ధాలు కొనసాగుతూనే ఉంటాయి. ఒక దేశ ఆర్థిక, పారిశ్రామిక శక్తికి సవాలు విసురుతాయి. భారీ ఖర్చుతో కూడిన ఆయుధాలతో అంత ఎక్కువ కాలం యుద్ధంలో పాల్గొంటే ఏ దేశమైనా ఆర్థికంగా చితికిపోక తప్పదు. దీంతో యుద్ధాల విషయంలో చాలా దేశాలు పునరాలోచించుకుంటున్నాయి. మన దేశ రక్షణ వ్యూహకర్తలు.. సుదీర్ఘ యుద్ధాల్లో కొత్త టెక్నాలజీతో పాటు తక్కువ ఖర్చుతో తయారయ్యే ఆయుధాల తయారీపై దృష్టి సారించారు (Indian defence strategy).


ఈ నేపథ్యంలో రెండు నెలల క్రితం మన దేశం పినాకా మల్టీ-బ్యారెల్ లాంచర్‌ను విజయవంతంగా ప్రయోగించింది (Pinaka rocket system). 300 కి.మీ. పరిధి గల పినాకా-ఎమ్‌కే4 క్షిపణిని 2023 నాటికి సైన్యంలో చేర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖరీదైన క్రూయిజ్ క్షిపణులకు బదులుగా, తక్కువ ఖర్చుతో పదే పదే మోహరించగల ఈ స్కేలబుల్ ఫైర్‌ పవర్‌ సైన్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. భారతదేశం సుదీర్ఘమైన, తీవ్రమైన సంఘర్షణలో పాల్గొనాల్సి ఉంటే ఇలాంటి అధునాతన, చవకైన ఆయుధాలు అవసరం.


ఈ ఆలోచనలకు పినాకా-ఎమ్‌కే4 సరిగ్గా సరిపోతుంది. ఘన ఇంధనంతో నడిచే ఈ పినాక మిసైల్.. బాలిస్టిక్ క్షిపణికి సమానమైన వేగాన్ని కలిగి ఉంటుంది. 38 కి.మీ. నుంచి 300 కి.మీ. వరకు ప్రయాణించగలదు. బ్రహ్మోస్ క్షిపణిని తయారు చేయడానికి రూ.15-20 కోట్లు అవసరం. అదే పినాక మిసైల్ తయారీకి రూ.4-5 కోట్లు సరిపోతాయి. ఈ పినాక-ఎమ్‌కే4 మిసైల్ భారతదేశం డీప్-స్ట్రైక్ సామర్థ్యాన్ని మూడు రెట్లు పెంచుతుంది (Baby BrahMos).


ఈ పినాక మిసైల్స్‌ను మనదేశంలోనే తక్కువ ఖర్చుతో తయారు చేయగలుగుతారు (India missiles). యుద్ధ సమయంలో భౌగోళిక, రాజకీయాల ద్వారా ప్రభావితమయ్యే విదేశీ సరఫరాదారులపై ఆధారపడటాన్ని తగ్గించడం కూడా స్వదేశీ తయారీకి కారణమవుతోంది. ఈ పినాక మిసైల్స్‌ను చాలా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయవచ్చు. ఈ మిసైల్స్‌పై ఆర్మేనియా, ఫ్రాన్స్ వంటి దేశాలు కూడా ఆసక్తి చూపుతున్నాయి. వీటిని దిగుమతి చేసుకునే దిశగా ఆలోచనలు చేస్తున్నాయి.


ఇవి కూడా చదవండి..

మీ కళ్లు చురుకైనవి అయితే.. ఈ ఫొటోలో HOT పదాన్ని 5 సెకెన్లలో కనుగొనండి..


ప్రియురాలి పెళ్లికి వచ్చిన ప్రియుడు.. అందరూ చూస్తుండగా ఏం చేశాడంటే..

Updated Date - Feb 25 , 2026 | 06:47 PM