Share News

పగలు ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్.. రాత్రిళ్లు దొంగ.. చిన్న తప్పుతో దొరికిపోయాడు..

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:50 PM

ఫైవ్ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పని చేసే ఓ యువకుడు ఈజీ మనీ కోసం దొంగగా మారాడు. పగలు హోటల్‌లో పని చేస్తూ.. రాత్రిళ్లు దొంగతనాలు చేయటం మొదలెట్టాడు. ఓ ఇంట్లో దొంగతనం చేసిన అతడు చిన్న తప్పు కారణంగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

పగలు ఫైవ్ స్టార్ హోటల్లో చెఫ్.. రాత్రిళ్లు దొంగ.. చిన్న తప్పుతో దొరికిపోయాడు..
Delhi chef thief

న్యూఢిల్లీ, మార్చి 20: ఫైవ్ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పని చేసే ఓ యువకుడు ఈజీ మనీ కోసం దొంగగా మారాడు. పగలు హోటల్‌లో పని చేస్తూ.. రాత్రిళ్లు దొంగతనాలు చేయటం మొదలెట్టాడు. ఓ ఇంట్లో దొంగతనం చేసిన అతడు చిన్న తప్పు కారణంగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. ఆర్కేపురంలోని సెక్టార్12కు చెందిన నిలేశ్ ఇంటర్ పూర్తి చేశాడు.


స్థానికంగా ఉండే ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో చెఫ్‌గా పని చేస్తున్నాడు. చెఫ్‌గా పని చేస్తే వచ్చిన శాలరీ అతడి జల్సాలకు సరిపోలేదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని భావించాడు. ఇందుకోసం దొంగతనాలు చేయటం మొదలెట్టాడు. కొద్దిరోజుల క్రితం ఆర్కేపురంలోని ఓ ఇంట్లో దొంగతనం చేశాడు. 3.5 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండితో పాటు నగదు కూడా దోచేశాడు. నిలేశ్ ఇంట్లోకి వెళుతున్న దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సీసీటీవీ కెమెరాను పట్టించుకోకపోవటమే అతడి కొంపముంచింది.


ఇంటి యజమాని పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిలేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా.. దొంగతనం జరిగిన రోజు రాత్రి తాను హోటల్‌లో షిఫ్ట్‌లో ఉన్నానని చెప్పాడు. పోలీసులు హోటల్‌కు వెళ్లి ఎంక్వైరీ చేయగా అతడు చెప్పింది అబద్ధం అని తేలింది. పోలీసులు నిలేశ్ దొంగ అని నిర్ధారణకు వచ్చారు. అతడిని అరెస్ట్ చేశారు. అతడి వద్దనుంచి నగదు, ఆభరణాలను రికవర్ చేశారు. వేరే వ్యక్తి నుంచి దొంగిలించిన బైక్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.


ఇవి కూడా చదవండి

ఎయిర్‌పోర్టు అధికారి చెప్పినా వినని ఫలితం.. ప్యాసింజర్‌కు షాక్

తెలంగాణ శాసనసభ సోమవారానికి వాయిదా

Updated Date - Mar 20 , 2026 | 04:50 PM