రూ.52వేల కోట్ల ఆయుధాల కొనుగోలుకు డీఏసీ ఆమోదం
ABN , Publish Date - Jul 04 , 2026 | 06:14 AM
దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ, జూలై 3: దేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన గురువారం జరిగిన డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) సమావేశంలో త్రివిధ దళాల కోసం సుమారు రూ.52,000 కోట్ల విలువైన రక్షణ కొనుగోలు ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతో అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు లైన్ క్లియర్ అయినట్టయింది. భారత సైన్యం కోసం... శత్రు డ్రోన్లను కూల్చేందుకు అవసరమైన ‘ఆకాశ్ తరంగ్’ ఎలకా్ట్రనిక్ వార్‌ఫేర్ వ్యవస్థ, మ్యాన్ పోర్టబుల్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణులు, మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్స్, వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ట్యాంకుల కోసం యాక్టివ్ ప్రొటెక్షన్ సిస్టమ్, కామికాజ్ డ్రోన్ వ్యవస్థలను సేకరించానున్నారు. నౌకాదళం, వాయుసేన కోసం కూడా అధునాతన ఆయుధాల కొనుగోలు చేయనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
వీధులు శుభ్రం చేసినట్టు ఏఐ చిత్రాలు.. మున్సిపల్ సిబ్బందిపై వేటు
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. ఉగ్రవాదం ఆగేదాకా..