జర్నలిస్టు సుధీర్ చౌదరిపై పరువునష్టం దావా
ABN , Publish Date - Sep 08 , 2026 | 05:14 AM
పరువునష్టం దావాపై ప్రముఖ జర్నలిస్టు సుధీర్‌చౌదరి, ప్రభుత్వరంగ దూరదర్శన్(డీడీ) న్యూస్ చానల్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది.
జర్నలిస్టు సుధీర్ చౌదరిపై పరువునష్టం దావా
డీడీ న్యూస్ చానల్‌పై కూడా దావా వేసిన జెన్‌జీ యాక్టివిస్ట్ విజయ్ శరావత్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 7: పరువునష్టం దావాపై ప్రముఖ జర్నలిస్టు సుధీర్‌చౌదరి, ప్రభుత్వరంగ దూరదర్శన్(డీడీ) న్యూస్ చానల్‌కు ఢిల్లీ హైకోర్టు సోమవారం నోటీసులు జారీచేసింది. జూలైలో కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) ఢిల్లీలో నిరసన ప్రదర్శన నిర్వహించిన సమయంలో తన పరువుకు భంగం కలిగించేలా డీడీ న్యూస్ చానల్‌లో సుధీర్ చౌదరి ఒక కార్యక్రమం నిర్వహించారని ఉద్యమకారుడు విజయ్ శరావత్ ఢిల్లీ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. జూలై 27న ప్రసారమైన ఆ కార్యక్రమంలో తాను పార్లమెంటును ధ్వంసం చేసి, భారత్‌ను నేపాల్‌లా మార్చాలని పిలుపునిచ్చినట్లు సుధీర్‌చౌదరి ఆరోపించారని తెలిపారు. తప్పుడు ప్రచారం చేసి తన పరువుకు భంగం కలిగించినందుకు సుధీర్‌చౌదరి, ఆయన నిర్మాణ సంస్థ ఎస్ర్పిత్ ప్రొడక్షన్స్, డీడీ న్యూస్ చానల్‌ల నుంచి తనకు రూ.25 కోట్ల పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలో ‘సర్’ గడువు పొడిగింపు
తల్లిని అవమానిస్తే.. కొడుకు రక్తం మరగదా?